‘మారెమ్మ’ ట్రైలర్ అద్భుతంగా ఉంది: దర్శకుడు శివ నిర్వాణ

- September 01, 2026 , by Maagulf
‘మారెమ్మ’ ట్రైలర్ అద్భుతంగా ఉంది: దర్శకుడు శివ నిర్వాణ

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా 'మారెమ్మ'తో హీరోగా పరిచయం అవుతున్నారు. మంచాల నాగరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మోక్ష ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మయూర్ రెడ్డి బండారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, పాటలు కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 10 ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వస్తోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకుడు శివ నిర్వాణ హాజరయ్యారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ట్రైలర్ ని డిజిటల్ గా లాంచ్ చేశారు.  

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. మాధవ్ తో రవితేజ గారి ‘ఇరుముడి’ జర్నీ మొదలైనప్పటి నుంచే పరిచయం అయింది. షూటింగ్ సమయంలో అల్యూమినియం ఫ్యాక్టరీలో మాధవ్‌ను కలిశాను. నాకు అప్పుడు ‘మారెమ్మ’ సినిమా చేస్తున్నానని చెప్పాడు. తను చెప్పినప్పుడు మేము ‘ఇరుముడి’ కోసం లొకేషన్స్ చూస్తున్నాం. మొదటి చూసిన  లోకేషన్ ‘మారెమ్మ’ గుడి. ‘ఇరుముడి’లో ‘కట్టు కట్టు’ సాంగ్ ఆ టెంపుల్ బ్యాక్‌గ్రౌండ్‌లోనే చేశాం. ‘మారెమ్మ’ టీజర్‌ను చూపించాడు. చాలా ఇంటెన్సిటీ ఉంది. నిజానికి ఒక డెబ్యూ హీరో తొలి సినిమా చేస్తున్నప్పుడు పాటలు, ఫైట్లు అన్నీ ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. ఒక ప్రేమకథతో రావాలి అనుకుంటారు. కానీ అవన్నీ కాకుండా ఒక మంచి కంటెంట్ బేస్డ్ సినిమాని తను ఎంపిక చేసుకోవడం పట్ల నేను తనని అభినందిస్తున్నాను. తను నిజాయితీగా దర్శకుడు చెప్పిన కథను నమ్మి ఈ ప్రయత్నం చేశాడు. ఫస్ట్ సినిమాకే ఇంత హార్డ్ కంటెంట్‌ను ఎంచుకోవడం మామూలు విషయం కాదు. ట్రైలర్ చాలా అద్భుతంగా కట్ చేశారు. ట్రైలర్‌లో కథను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా అద్భుతంగా చెప్పారు. ఈ కథలో ఉన్న ఇంటెన్సిటీ, మ్యూజిక్, ఫోటోగ్రఫీ చాలా బాగున్నాయి. కథకి ఏం కావాలో అది చేసుకుంటూ వెళ్తే ప్రతి కథ ఒక బ్లాక్‌బస్టర్ అవుతుంది. సినిమా బ్లాక్‌బస్టర్ కావడానికి ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. దీప చాలా నేచురల్ గా ఉన్నారు. నిర్మాతలు కంటెంట్‌ను నమ్మి ఈ సినిమా చేశారు. ఈ ప్రయత్నం విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రైలర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ 10న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతుంది. అందరూ థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.

హీరో మాధవ్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ముందుగా దర్శకుడు శివ నిర్వాణ గారికి ధన్యవాదాలు. అలాగే మా ట్రైలర్‌ను డిజిటల్‌గా లాంచ్ చేసిన రామ్ పోతినేని గారికి థాంక్యూ సో మచ్. ఈ ట్రైలర్ మీ అందరికీ నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాతో పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. బేసిగ్గా అన్నదమ్ముల మధ్య ఒక ఎమోషన్ ఉంటుంది. కానీ ఇందులో ఒక దున్నపోతుకు మరొక మనిషికి ఉండే అనుబంధం ఎలా ఉంటుందో సెప్టెంబర్ 10న మీకు కనిపించబోతుంది. ఈ కథని నా దగ్గరికి తీసుకొచ్చిన మా నిర్మాతలకు థాంక్యూ. మా ఎడిటర్ కి, మ్యూజిక్ డైరెక్టర్‌కి, డీఓపీకి, ఆర్ట్‌కి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రవితేజ గారి ఫ్యాన్స్ అందరికీ థాంక్యూ. రవితేజ గారు ఈ సినిమా చూశారు. ఆయనకి క్లైమాక్స్ చాలా అద్భుతంగా నచ్చింది. చాలా ఎమోషనల్ అయ్యారు. ‘ఇరుముడి’ సక్సెస్‌తో అందరూ మంచి జోష్‌లో ఉన్నారు. దీన్ని ఇలాగే కంటిన్యూ చేయడానికి మ్యాక్సిమమ్ ట్రై చేస్తాను. సెప్టెంబర్ 10న మీరందరూ సపోర్ట్ చేస్తే కచ్చితంగా కొట్టేద్దాం.

హీరోయిన్ దీప మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. టీజర్, ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా హ్యాపీగా ఉంది. సెప్టెంబర్ 10న సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్‌లోకి వెళ్లి తప్పకుండా చూడండి. మా నిర్మాతలకు ధన్యవాదాలు. మాధవ్ గారితో నటించడం చాలా ఆనందంగా ఉంది. మా టీమ్ అందరికీ థాంక్యూ. తప్పకుండా అందరూ సెప్టెంబర్ 10న ‘మారెమ్మ’ సినిమాని చూడాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ నాగరాజు మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా హ్యాపీగా ఉంది. ట్రైలర్‌కి పదిరెట్లు సినిమా ఉంటుంది. సినిమా చివరి 20 నిమిషాల్లో గూస్‌బంప్స్ క్రియేట్ చేస్తుంది.  ‘మారెమ్మ’ అనేది ప్రతి విలేజ్‌లో ప్రతి మనిషి చూసుకునే క్యారెక్టర్‌లాగా ఉంటుంది. మన ఊర్లో జరిగిన కథ చూస్తున్నట్టుగా ఉంటుంది. ఈ కల్చర్ మనందరి ఊర్లలో ఉంది. అదే కల్చర్‌ని విజువల్‌గా చూడబోతున్నారు. తప్పకుండా సినిమా యూనిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

నిర్మాత మయూర్ మాట్లాడుతూ: మా ట్రైలర్‌ను లాంచ్ చేసిన శివ నిర్వాణ గారికి, అలాగే డిజిటల్‌లో లాంచ్ చేసిన హీరో రామ్ పోతినేని గారికి ధన్యవాదాలు. ఇది మన తెలంగాణ పల్లెటూరి సినిమా. మన అందరి ఊర్లో ఉండే కథ. డైరెక్టర్ నాగరాజు అద్భుతంగా తీశారు.  కొత్త హీరోలు అంటే యాక్షన్, లవ్ స్టోరీ వైపు చూస్తారు. మాధవ్ మాత్రం ఇలాంటి ఇంటెన్స్ కథను ఎంచుకోవడం నిజంగా సాహసమే. తన హార్డ్ వర్క్‌కి థాంక్యూ చెప్తున్నాను. దీప మన తెలుగు అమ్మాయిలాగే ఉంటుంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.

వికాస్ వశిష్ట మాట్లాడుతూ: ట్రైలర్ అదిరిపోయింది. సినిమా దద్దరిల్లిపోతుంది. మాధవ్‌తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. మా నిర్మాతలకు సినిమా అంటే చాలా ఫ్యాషన్. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి. తప్పకుండా అందరూ ఈ సినిమాని థియేటర్‌లో చూడాలని కోరుకుంటున్నాను. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.

తారాగణం: మాధవ్, దీపా బాలు, వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, V.S.రూపా లక్ష్మి

సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: మోక్ష ఆర్ట్స్
రచన & దర్శకత్వం: మంచాల నాగరాజ్
నిర్మాత: మయూర్ రెడ్డి బండారు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఉమేష్ విలాసాగరం
డీవోపీ: ప్రశాంత్ అంకిరెడ్డి
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
ఎడిటర్: దేవ్ రాథోడ్
ఆర్ట్ డైరెక్టర్: రాజ్ కుమార్ మురుగేషన్
యాక్షన్ డైరెక్టర్: మాడిగొండ నటరాజ్
కొరియోగ్రాఫర్: సాగ్గీ సాగర్
Vfx : చంద్ర కాయల
డిజైనర్: సునందిని విజ్జగిరి
సాహిత్యం: మిట్టపల్లి సురేందర్, కమల్ ఎస్లావత్
స్టిల్స్ & మేకింగ్: శేఖర్ కథుల
పబ్లిసిటీ డిజైన్స్: అనంత్ కంచెర్ల
PRO: వంశీ శేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com