కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- September 02, 2026
కువైట్ సిటీ: కువైట్ రాజధాని గవర్నరేట్ పరిధిలోని ఓ నివాస సముదాయంపై బుధవారం తెల్లవారుజామున డ్రోన్ దాడి జరిగింది. ఇరాన్ దాడుల్లో భాగంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు కువైట్ అధికారులు తెలిపారు.
డ్రోన్ ఢీకొనడంతో నివాస సముదాయంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అల్-హిలాలీ, అల్-మదీనా అగ్నిమాపక కేంద్రాలకు చెందిన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
కువైట్ న్యూస్ ఏజెన్సీ (KUNA) ప్రచురించిన ప్రకటనలో కువైట్ ఫైర్ ఫోర్స్ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అల్-ఘరీబ్ ఈ వివరాలను వెల్లడించారు. అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే సహాయక చర్యలు చేపట్టి మంటలను పూర్తిగా నియంత్రించాయని తెలిపారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని అల్-ఘరీబ్ స్పష్టం చేశారు. నష్టం కేవలం ఆస్తిపరమైనదేనని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్‌కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్‌లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







