కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- September 02, 2026
కువైట్ : కువైట్ రాజధాని ప్రాంతంలోని ఓ నివాస సముదాయంలో తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే జనరల్ ఫైర్ ఫోర్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.
జనరల్ ఫైర్ ఫోర్స్ అధికారిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అల్-ఘరీబ్ మాట్లాడుతూ.. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక బృందాలు వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపట్టాయని తెలిపారు.
అగ్నిమాపక సిబ్బంది మంటలు మరింత వ్యాపించకుండా నియంత్రించి పూర్తిగా ఆర్పివేశారని చెప్పారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, కేవలం ఆస్తి నష్టం మాత్రమే సంభవించిందని అధికారులు వెల్లడించారు.
ప్రస్తుత భద్రతా పరిస్థితుల నేపథ్యంలో అత్యవసర ఘటనలకు వెంటనే స్పందించేందుకు, ప్రజల ప్రాణాలు మరియు ఆస్తులను రక్షించేందుకు జనరల్ ఫైర్ ఫోర్స్ పూర్తిస్థాయి సంసిద్ధతతో ఉందని అల్-ఘరీబ్ స్పష్టం చేశారు. కాగా, ఈ ఘటనకు శత్రు డ్రోన్ కారణం అయిండొచ్చని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్‌కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్‌లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







