బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- September 03, 2026
మనామా: బహ్రెయిన్ యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, జీవన నైపుణ్యాలను పెంపొందించడంలో గదేహా ‘అప్ టు ది ఛాలెంజ్’ జూనియర్ ట్రైనింగ్ క్యాంప్ కీలక పాత్ర పోషిస్తోందని బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా పేర్కొన్నారు.
గదేహా జూనియర్ ట్రైనింగ్ క్యాంప్‌ను సందర్శించిన సందర్భంగా యువత కోసం నిర్వహిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాలు, వ్యాయామాలు, కార్యకలాపాలు, ఆచరణాత్మక అనుభవాలను రాజు పరిశీలించారు. పాల్గొనేవారిలో వ్యక్తిగత సామర్థ్యాలను అభివృద్ధి చేయడంతో పాటు నిబద్ధత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జాతీయ భావన, జట్టు స్ఫూర్తి వంటి విలువలను పెంపొందించేలా ఈ కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు.
షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా శిబిరం లక్ష్యాలు, శిక్షణ కార్యక్రమాలు, వివిధ వయస్సుల యువత భాగస్వామ్యం గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూల స్పందన లభిస్తున్నట్లు తెలిపారు.
గదేహా శిబిరం తొలి ఎడిషన్ విజయవంతం కావడంపై కింగ్ హమద్ సంతోషం వ్యక్తం చేశారు. యువతలో శారీరక, మానసిక సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు వారి వ్యక్తిత్వాన్ని, జాతీయ గుర్తింపును బలోపేతం చేయడంలో శిబిరం ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని కింగ్ పేర్కొన్నారు.
బాధ్యతలు స్వీకరించడం, నాయకత్వాన్ని ప్రదర్శించడం, స్వయం ఆధారితంగా వ్యవహరించడం, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేందుకు అవసరమైన అనుభవం, నైపుణ్యాలను యువతకు అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
యువతే దేశ భవిష్యత్తు
బహ్రెయిన్ అభివృద్ధిలో యువతదే కేంద్ర పాత్ర అని కింగ్ హమద్ స్పష్టం చేశారు. దేశ అంతర్జాతీయ ప్రతిష్ఠను, నాయకత్వ స్థానాన్ని మరింత బలోపేతం చేయడంలో యువత విశేషంగా దోహదపడుతోందన్నారు. యువతే భవిష్యత్తు నిర్మాతలు, ఆవిష్కరణలకు మార్గదర్శకులు అని పేర్కొన్న ఆయన.. వారి ప్రతిభ, సామర్థ్యాల అభివృద్ధికి పెట్టుబడి పెట్టడం అంటే దేశ అభివృద్ధి, సమాజ పురోగతి, శ్రేయస్సులో పెట్టుబడి పెట్టడమేనని అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







