ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!

- September 04, 2026 , by Maagulf
ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!

దోహా: ఇంటి లేదా భవనాల ప్రవేశ, ఎగ్జిట్ మార్గాలను అడ్డుకునేలా వాహనాలను పార్కింగ్ చేయడం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన అని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) హెచ్చరించింది. ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 78, క్లాజ్ 4 ప్రకారం ఇంటి ప్రవేశ ద్వారం ముందు వాహనం పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా విధించడంతో పాటు డ్రైవర్ రికార్డులో 3 ట్రాఫిక్ పాయింట్లు నమోదు చేస్తారు. ఇలాంటి పార్కింగ్ వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడంతో పాటు ఇతరుల హక్కులు, ప్రయోజనాలకు భంగం కలుగుతుందని MoI తెలిపింది.

ఇంటి ముందు వాహనాలను పార్కింగ్ చేసేటప్పుడు ప్రవేశ, ఎగ్జిట్ మార్గాలను పూర్తిగా ఖాళీగా ఉంచాలని, ఇతర వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకి కలిగించవద్దని మంత్రిత్వ శాఖ సూచించింది. “ఇతరుల హక్కులను గౌరవించడంతో పాటు ట్రాఫిక్ ఉల్లంఘనకు గురికాకుండా ఉండాలంటే సరైన విధంగా పార్కింగ్ చేయాలి” అని MoI తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com