'ధర్మన్' రెండవ షెడ్యూల్ పూర్తి
- September 05, 2026
సూపర్ స్టార్ రజనీకాంత్ 'ధర్మన్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 'ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్ఫుల్ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తాజాగా మేకర్స్ రెండవ షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో సూపర్ స్టార్ తనదైన చరిస్మా, ప్రజెన్స్ తో అదరగొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ మధ్య ఉన్నంత స్నేహబంధం చాలా అరుదు. భారతీయ చలనచిత్ర రంగంలో ఐదు దశాబ్దాలకు పైగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ఈ ఇద్దరు దిగ్గజాలు, 'ధర్మన్' చిత్రం ద్వారా నిర్మాత-నటుడిగా మొదటిసారిగా కలిసి పనిచేస్తున్నారు.
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్,ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రం, RKFI నిర్మాణంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించే మొదటి సినిమా కావడం విశేషం.
భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని, అత్యంత ఆసక్తికరమైన యువ దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పాటు, దక్షిణాది చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటి సిమ్రాన్, తమిళ, తెలుగు, హిందీ చిత్రాలలో తన అద్భుత నటనతో గుర్తింపు పొందిన రాశీ ఖన్నా ఈ చిత్రంలో నటిస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను రూపొందించడంలో పేరుగాంచిన జాతీయ అవార్డు గ్రహీతలు 'అన్బరివ్' ద్వయం యాక్షన్ కొరియోగ్రఫీని నిర్వహిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా నికేత్ బొమ్మిరెడ్డి , కార్తీక్ రాజ్‌కుమార్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా, అన్నదురై ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అలాగే డిస్నీ సంస్థ దీనికి సహ-నిర్మాతగా వ్యవహరిస్తోంది
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







