మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- September 05, 2026
మస్కట్: దోహా నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఇండిగో విమానం సిబ్బందిలో ఒకరికి అకస్మాత్తుగా వైద్య అత్యవసర పరిస్థితి తలెత్తడంతో విమానాన్ని మస్కట్‌కు మళ్లించారు. ఒమన్‌లోని మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్పోర్ట్ వైద్య బృందాలు సంబంధిత సిబ్బందికి అత్యవసర చికిత్స అందించాయి. ప్రస్తుతం వారు కోలుకున్నట్లు సమాచారం.
ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఇండిగో ప్రత్యామ్నాయ విమానంతో పాటు కొత్త విమాన సిబ్బందిని ఏర్పాటు చేసింది. దీంతో ప్రయాణికులను మస్కట్ నుంచి వారి తుది గమ్యస్థానమైన బెంగళూరుకు తరలించే ఏర్పాట్లు చేసింది. విమానం కోసం వేచి ఉన్న సమయంలో మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు రిఫ్రెష్మెంట్స్ అందించడంతో పాటు ఎప్పటికప్పుడు విమాన పరిస్థితిపై సమాచారం అందించారు. ఈ ఘటనతో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఇండిగో సంస్థ విచారం వ్యక్తం చేసింది. ప్రయాణికులు, విమాన సిబ్బంది, విమాన భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని సంస్థ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- షార్జాలో పోగొట్టుకున్న, యజమానులు క్లెయిమ్ చేయని వస్తువుల నిర్వహణపై కొత్త చట్టం
- సౌదీ అరేబియాలో 5 డ్రోన్లను అడ్డుకున్న సంకీర్ణ దళాలు..
- ఏపీలో ఎన్నికల పై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- మొబైల్ ఫోన్ గొడవ..ఇద్దరి హత్యకు దారి
- దుబాయ్‌లో ఘనంగా స్పార్క్ మీడియా 5వ వార్షిక బతుకమ్మ సంబరాలు 2026
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్‌లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం
- షార్జాలో ఇంధన వాసనపై ఆందోళన వద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది: అధికారులు
- మక్కాలో అనుచిత చర్యల వీడియోపై తప్పుడు ప్రచారం.. స్పష్టం చేసిన హోలీ మాస్క్స్
- బహ్రెయిన్ రాజు హమద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..







