ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- September 05, 2026
అమరావతి: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ సీఎం సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు.
సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర అమూల్యం
భావి భారత పౌరులను తీర్చిదిద్దుతూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ప్రతి ఉపాధ్యాయుడికి సీఎం ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. సమాజ నిర్మాణంలోనూ, విద్యారంగ అభివృద్ధిలోనూ గురువుల పాత్ర ఎంతో అమూల్యమైనదని ఆయన కొనియాడారు.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత విశేషాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. అత్యంత సామాన్య నేపథ్యం నుంచి వచ్చిన ఆయన, తన ఆదర్శవంతమైన జీవనశైలితో దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి బాధ్యతలను చేపట్టారని పేర్కొన్నారు. సర్వేపల్లి ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గాన్ని, పాటించిన విలువలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- షార్జాలో పోగొట్టుకున్న, యజమానులు క్లెయిమ్ చేయని వస్తువుల నిర్వహణపై కొత్త చట్టం
- సౌదీ అరేబియాలో 5 డ్రోన్లను అడ్డుకున్న సంకీర్ణ దళాలు..
- ఏపీలో ఎన్నికల పై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- మొబైల్ ఫోన్ గొడవ..ఇద్దరి హత్యకు దారి
- దుబాయ్లో ఘనంగా స్పార్క్ మీడియా 5వ వార్షిక బతుకమ్మ సంబరాలు 2026
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం
- షార్జాలో ఇంధన వాసనపై ఆందోళన వద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది: అధికారులు
- మక్కాలో అనుచిత చర్యల వీడియోపై తప్పుడు ప్రచారం.. స్పష్టం చేసిన హోలీ మాస్క్స్
- బహ్రెయిన్ రాజు హమద్తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..







