బ్యాంక్ మెల్లీ ఇరాన్ పై UAE సెంట్రల్ బ్యాంక్ కఠిన చర్యలు
- September 23, 2026
అబుదాబి: యూఏఈలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బ్యాంక్ మెల్లీ ఇరాన్ శాఖలపై యూఏఈ సెంట్రల్ బ్యాంక్ కఠిన ఆంక్షలు విధించింది. ఈ శాఖలు ఇరాన్‌కు, ఇరాన్ నుంచి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించకుండా నిషేధం విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది.
సెంట్రల్ బ్యాంక్ నిర్వహించిన తనిఖీల్లో గుర్తించిన అంశాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో యూఏఈలో పనిచేస్తున్న బ్యాంక్ మెల్లీ ఇరాన్ అన్ని శాఖలు ఇరాన్‌కు, ఇరాన్ నుంచి నిధుల బదిలీలు, ట్రేడ్ ఫైనాన్స్ సహా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది.
నిబంధనల ఉల్లంఘన పై చర్యలు
యూఏఈలో అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనలు, పర్యవేక్షణకు సంబంధించిన నిర్ణయాలను పాటించకపోవడం వంటి ఉల్లంఘనల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది.
ముఖ్యంగా మనీ లాండరింగ్ నిరోధం, ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం (ఫైనాన్సింగ్) నిరోధం, ప్రొలిఫరేషన్ ఫైనాన్సింగ్ నిరోధానికి సంబంధించిన చట్టపరమైన అవసరాలు, బాధ్యతలను పాటించడంలో లోపాలు ఉన్నట్లు పేర్కొంది.
ఈ చర్యలు 2025 ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 6లోని ఆర్టికల్ 168-1-C ప్రకారం తీసుకున్నట్లు యూఏఈ సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఈ చట్టం సెంట్రల్ బ్యాంక్, ఆర్థిక సంస్థలు, ఆర్థిక కార్యకలాపాల నియంత్రణ, అలాగే బీమా వ్యాపారానికి సంబంధించిన నిబంధనలను నిర్దేశిస్తుంది.
తాజా వార్తలు
- భారత దేశవ్యాప్తంగా రేపు కాంగ్రెస్ నిరసనలు
- యూఏఈలో ఇరాన్ ఎయిర్‌లైన్స్ విమానాలు నిలిపివేత.. తదుపరి ఆదేశాల వరకు సస్పెన్షన్
- దుబాయ్ ఫౌంటెన్ షోలు పునఃప్రారంభం.. తగ్గిన శబ్దంతో ప్రదర్శనలు
- స్థానిక ఎన్నికల పై జగన్ ఫోకస్.. అభ్యర్థుల ఎంపిక పై కీలక ఆదేశాలు
- 476 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు, సూపర్వైజర్లకు దుబాయ్ పోలీసుల శిక్షణ
- అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!
- ఖతార్‌లో ఇంటర్నేషనల్ స్పేస్ వీక్ 2026..!!
- బహ్రెయిన్‌లో అక్టోబర్ 9న ‘ట్రిబ్యూట్ టు బహ్రెయిన్’..!!
- కువైట్‌లో 77 సంస్థలకు ఫైర్ సేఫ్టీ హెచ్చరికలు..!!
- దుబాయ్ డ్యూటీ ఫ్రీలో $1 మిలియన్ గెలిచిన భారతీయుడు..!!







