అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!

- September 24, 2026 , by Maagulf
అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!

మస్కట్: ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ల పరిధిలోని పలు విలాయత్‌లలో ఫీల్డ్ టూర్‌ను ప్రారంభించారు. అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించడం, సామాజిక సేవలను మెరుగుపరచడం, స్థానిక ఆర్థిక, పర్యాటక రంగాల సామర్థ్యాన్ని మరింత వినియోగించుకోవడం లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతోంది.

పర్యటనలో భాగంగా సుల్తాన్ దుక్మ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZAD), దుక్మ్ పోర్ట్ ‌ను సందర్శించారు. అక్కడ మౌలిక వసతుల విస్తరణ, భవిష్యత్ పెట్టుబడి వ్యూహాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

దుక్మ్ పోర్ట్‌కు సుల్తాన్ చేరుకున్న సందర్భంగా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అండ్ ఫ్రీ జోన్స్ పబ్లిక్ అథారిటీ చైర్మన్‌తో పాటు పోర్ట్, జోన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వివిధ కంపెనీల అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.

దుక్మ్ ప్రత్యేక ఆర్థిక మండలి వ్యూహాత్మక భౌగోళిక స్థానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని సుల్తాన్ హైతమ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతాన్ని ప్రాంతీయ ఆర్థిక, లాజిస్టిక్స్ హబ్‌గా మరింత అభివృద్ధి చేయడంతో పాటు స్థానిక, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే చర్యలను కొనసాగించాలని సూచించారు.

వివిధ విలాయత్‌లలో జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులు, కార్యక్రమాల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. అలాగే పౌరులు, నివాసితులకు అందుతున్న అభివృద్ధి, సేవలను మెరుగుపరిచేందుకు వారి అవసరాలు, అభిప్రాయాలను తెలుసుకోవడంపై కూడా సుల్తాన్ దృష్టి సారించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com