ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- October 08, 2026
దోహా: శీతాకాలంలో ఇన్‌ఫ్లూయెంజా (ఫ్లూ) కేసులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) జాతీయ సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా టీకా, అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం 2027 మార్చి వరకు కొనసాగనుంది. హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC), ప్రైమరీ హెల్త్‌కేర్ కార్పొరేషన్ (PHCC)తో పాటు ప్రభుత్వ, సెమీ-గవర్నమెంట్, ప్రైవేట్ ఆరోగ్య సంస్థల సహకారంతో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
ఫ్లూ కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న వర్గాలపై ఈ ఏడాది ప్రచారంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు, 6 నెలల నుంచి 5 ఏళ్లలోపు పిల్లలు, గర్భిణులు, ఆరోగ్య కార్యకర్తలు, డయాబెటిక్, ఆస్తమా తదితర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
50కి పైగా కేంద్రాల్లో ఉచితంగా వ్యాక్సిన్
అర్హులైన వారికి ఫ్లూ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తున్నారు. PHCC కేంద్రాలు, HMC ఆరోగ్య కేంద్రాలతో పాటు దేశవ్యాప్తంగా 50కి పైగా ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాల్లో కూడా టీకా అందుబాటులో ఉంది. PHCC కేంద్రాల్లో టీకా తీసుకోవాలనుకునే అర్హులైన వారు ముందస్తు అపాయింట్మెంట్ లేకుండానే నేరుగా వెళ్లి టీకా వేయించుకోవచ్చు. రోగుల నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు ఫాస్ట్-ట్రాక్ విధానాలను కూడా ప్రవేశపెట్టారు.
ప్రతి ఏడాది కొత్త ఫ్లూ వ్యాక్సిన్ ఎందుకు?
MoPH ఆరోగ్య రక్షణ, అంటువ్యాధుల నియంత్రణ విభాగం డైరెక్టర్ డాక్టర్ హమద్ ఈద్ అల్-రొమైహి మాట్లాడుతూ.. జాతీయ ఫ్లూ టీకా ప్రచారం ద్వారా వ్యాధుల నివారణపై ఖతార్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోందన్నారు. ఫ్లూ వ్యాక్సిన్ సురక్షితమైనదే కాకుండా సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా నుంచి రక్షణ కల్పించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలిపారు. ఇన్‌ఫ్లూయెంజా వైరస్లు నిరంతరం మారుతుండటంతో, రాబోయే సీజన్లో ఎక్కువగా వ్యాప్తి చెందే వైరస్ రకాల ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రతి ఏడాది కొత్త వ్యాక్సిన్‌ను రూపొందిస్తుందని వివరించారు. అందువల్ల ప్రతి ఏడాది శీతాకాలం ప్రారంభానికి ముందే, ముఖ్యంగా అక్టోబర్ లేదా నవంబర్‌లో ఫ్లూ టీకా తీసుకోవడం మంచిదని సూచించారు. టీకా తీసుకున్న తర్వాత శరీరంలో పూర్తి స్థాయి రోగనిరోధక శక్తి ఏర్పడటానికి సుమారు రెండు వారాలు పడుతుందని అధికారులు తెలిపారు.
న్యూమోనియా వంటి సమస్యలు వచ్చే అవకాశం
ఇన్‌ఫ్లూయెంజా సాధారణ జ్వరంగా కనిపించినప్పటికీ కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని MoPH హెచ్చరించింది. ముఖ్యంగా న్యూమోనియాతో పాటు ఇప్పటికే ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు తీవ్రంగా మారే ప్రమాదం ఉందని తెలిపింది.
అందువల్ల ఖతార్ పౌరులు, నివాసితులు, ముఖ్యంగా అధిక ప్రమాదం ఉన్న వర్గాలకు చెందిన వారు వీలైనంత త్వరగా సీజనల్ ఫ్లూ టీకా తీసుకోవాలని MoPH సూచించింది. మరిన్ని వివరాల కోసం ఖతార్ ఆరోగ్య శాఖ యూనిఫైడ్ కాల్ సెంటర్ 16000ను సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!







