సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- October 08, 2026
రియాద్ లక్ష్యంగా ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ రెబెల్స్ తీవ్ర క్షిపణి దాడికి దిగడంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరగడంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఇండియా, ఇండిగో విమానయాన సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారత నగరాల నుంచి రియాద్‌కు వెళ్లే పలు విమాన సర్వీసులను రద్దు చేయడంతో పాటు కొన్ని విమానాలను దారి మళ్లించాయి.
అక్టోబర్ 10 వరకు విమానాలు రద్దు
ఢిల్లీ నుంచి రియాద్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI2243 దాడి నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా అర్ధాంతరంగా తిరిగి ఢిల్లీకి మళ్లించబడింది. ఆ తర్వాత ఈ సర్వీసును పూర్తిగా రద్దు చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్రమవుతుండటంతో అక్టోబర్ 10 వరకు రియాద్‌కు వెళ్లే,అక్కడ నుంచి వచ్చే అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా తమ రియాద్ సర్వీసులను అక్టోబర్ 10 వరకు నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది.
రద్దయిన విమానాల ప్రయాణికులకు టికెట్ పూర్తి మొత్తాన్ని వాపసు ఇస్తామని యాజమాన్యం వెల్లడించింది.
ఇండిగో విమానం దారి మళ్లింపు
ఇండిగో సంస్థ కూడా రియాద్ మార్గంలో పలు ఆటంకాలను ఎదుర్కొంది. హైదరాబాద్ విమానం దారిమళ్లింపు: గురువారం హైదరాబాద్ నుంచి రియాద్‌కు బయలుదేరిన ఇండిగో విమానాన్ని అత్యవసరంగా సౌదీలోని దమామ్ విమానాశ్రయానికి దారి మళ్లించారు.
గురు, శుక్రవారాల్లో నడవాల్సిన రియాద్-ఢిల్లీ విమానాలతో పాటు, శుక్రవారం నాటి రియాద్-హైదరాబాద్, రియాద్-ముంబై సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ విమాన సమయాలను, తాజా సమాచారాన్ని సరిచూసుకోవాలని విమానయాన సంస్థలు సూచించాయి.
తాజా వార్తలు
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్
- దుబాయ్‌లో ‘బ్రిడ్జెస్ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ.. మత సామరస్యానికి పిలుపు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!







