విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- October 09, 2026
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతుండడంతో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లు ప్రయాణికులకు షాకిచ్చాయి. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఫ్యూయల్ సర్ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ఛార్జీలు అక్టోబర్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఛార్జీల వివరాలు
దేశీయ విమానాలు (వన్-వే): ప్రయాణించే దూరాన్ని బట్టి రూ.400 నుంచి రూ.1,200 వరకు అదనంగా ఫ్యూయల్ సర్ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.
అంతర్జాతీయ విమానాలు: పశ్చిమాసియా / మిడిల్ ఈస్ట్ రూట్లకు 55 డాలర్లు (సుమారు రూ 4,600) కాగా, ఉత్తర అమెరికా మార్గాలకు గరిష్టంగా 215 డాలర్లు (సుమారు రూ18,000) వరకు సర్ఛార్జ్ వర్తిస్తుంది. కంపెనీ వ్యయంలో అధిక భాగం ఇంధనానికే వెచ్చించాల్సి వస్తోందని, ఈ పరిస్థితి దృష్ట్యా సర్ఛార్జ్ పెంచక తప్పలేదని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.
మళ్లీ సర్ఛార్జ్ బాదుడు ప్రారంభించిన ‘అకాసా ఎయిర్’
అంతర్జాతీయ మరియు దేశీయ మార్గాల్లో సేవలందిస్తున్న మరో ప్రముఖ విమానయాన సంస్థ అకాసా ఎయిర్ కూడా ఇంధన భారాన్ని ప్రయాణికులపై వేసింది. మార్చి నెలలో ప్రవేశపెట్టి, ఆ తర్వాత రద్దు చేసిన ఫ్యూయల్ సర్‌ఛార్జ్‌ను అక్టోబర్ 9 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. దేశీయ విమాన సర్వీసులపై దూరాన్ని బట్టి రూ.375 నుంచి రూ.1150 ఫ్యూయల్ సర్ఛార్జీని వసూలు చేయనుంది. విదేశీ మార్గాల్లో వెళ్లే ప్రయాణాలపై రూ. 2,500 ఫ్లాట్ సర్ఛార్జ్ వసూలు చేయనున్నారు.
ఇటీవలే దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో కూడా ఇంధన ఛార్జీలను పెంచగా, ఇప్పుడు మిగిలిన సంస్థలు కూడా అదే దారిలో పయనించడంతో రానున్న పండుగల సీజన్లో విమాన ప్రయాణాలు మరింత భారంగా మారనున్నాయి.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







