ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- October 11, 2026
విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు దుర్గాదేవి బాలాత్రిపురసుందరీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనంకోసం తొలిరోజు భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారు జామున అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకార పూజలు నిర్వహించారు.
ఇంద్రకీలాద్రిపై ఆదివారం నుంచి 20వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. సామాన్య భక్తులకు రూ.100, రూ.300, రూ.500 దర్శన టికెట్లు రద్దు చేశారు. ఆదివారం (తొలి రోజు) ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 వరకు ఉచిత సర్వదర్శనం కల్పించారు. మిగిలిన రోజుల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 11 వరకు దర్శనాలకు అవకాశం కల్పించనున్నారు.
రూ.1,000 ప్రత్యేక దర్శనం టికెట్లు ‘మన మిత్ర’ వాట్సాప్, అధికారిక పోర్టల్‌లో ఆలయ నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. ప్రత్యేక దర్శనం భక్తులకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ముఖమండపం నుంచి అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. రూ.1,000 టికెట్ భక్తుల కోసం కుమ్మరిపాలెం నుంచి కొండపైకి ఉచిత ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.
అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తుండటంతో ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 18వేల మంది వేచి ఉండేలా మూడు హోల్డింగ్ కేంద్రాలు.. క్యూలైన్లలో 8,500 మందికి ఏర్పాట్లు చేశారు. 54 ప్రాంతాల్లో తాగునీరు, 370 మరుగుదొడ్లు, 600 జల్లు స్నానాల కోసం ఏర్పాట్లు చేశారు. రోజుకు 15వేల మందికి పైగా అన్నప్రసాదం.. 60 లక్షల లడ్డూల పంపిణీకి ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
అక్టోబర్ 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమ్మవారిని దర్శించుకోనున్నారు. అక్టోబర్ 16న సాయంత్రం అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అక్టోంబర్ 20వ తేదీన విజయదశమి ఉత్సవాల ముగింపు సందర్భంగా.. కృష్ణానదిలో హంసవాహన తెప్పోత్సవం ఉంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







