హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- October 11, 2026
వాషింగ్టన్/రియాద్: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హూతీ దాడిని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 309 మంది గాయపడినట్లు సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) వెల్లడించింది. మృతుల్లో ఒక అమెరికా పౌరుడు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా.. సౌదీ అరేబియాపై హూతీలు ఇటీవల జరిపిన దాడులను రూబియో తీవ్రంగా ఖండించారు. అమాయక పౌరుల ప్రాణాలను బలిగొనే ఇటువంటి దాడులను వెంటనే నిలిపివేయాలని ఆయన స్పష్టం చేశారు.
సౌదీ ప్రజలకు అండగా ఉంటాం: రూబియో
రియాద్ విమానాశ్రయంపై జరిగిన దాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం పట్ల అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందని రూబియో తెలిపారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ, సౌదీ అరేబియా ప్రభుత్వానికి, ప్రజలకు అమెరికా అండగా ఉంటుందని ప్రకటించారు. పౌరుల ప్రాణాల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా ఈ దాడులు జరిగాయని ఆయన విమర్శించారు.
మృతుల్లో పలు దేశాల పౌరులు
సౌదీ అరేబియా పౌర విమానయాన సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. దాడిలో మరణించిన 12 మందిలో నలుగురు సౌదీ పౌరులు ఉన్నారు. మిగిలిన వారిలో బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు, అమెరికా, ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, పాలస్తీనా, సూడాన్ దేశాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. ఈ దాడిలో మరో 309 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో ఆస్తులకు కూడా నష్టం వాటిల్లింది.
యుద్ధ నేరంగా అభివర్ణించిన సంకీర్ణ దళాలు
యెమెన్‌లో చట్టబద్ధ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న సంకీర్ణ దళాలు ఈ దాడిని యుద్ధ నేరంగా అభివర్ణించాయి. అంతర్జాతీయ మానవతా చట్టాలకు అనుగుణంగా తగిన ప్రతిస్పందన ఇస్తామని ప్రకటించాయి. రియాద్ విమానాశ్రయంపై జరిగిన ఈ దాడి నేపథ్యంలో సౌదీ అరేబియాకు అమెరికా మద్దతును పునరుద్ఘాటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







