నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- October 12, 2026
మనామా: గల్ఫ్ ప్రాంతంలో ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలనే లక్ష్యంతో GIG Gulf సంస్థ బహ్రెయిన్, యూఏఈ, ఒమన్, ఖతార్ దేశాల్లో ఒకేసారి వెల్నెస్ వాక్ నిర్వహించింది. సంస్థ వార్షిక కార్యక్రమం ‘Health on Track – My Wellness Week’ ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఫిజికల్ ఎక్సర్సైజ్, సామాజిక అనుబంధాలు, ఆరోగ్యంపై ముందస్తు శ్రద్ధ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని, రోజువారీ జీవితంలో నడక వంటి సాధారణ కార్యకలాపాలను భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.
బహ్రెయిన్‌లోని ది అవెన్యూస్ మాల్లో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో 300 మందికి పైగా పాల్గొన్నారు. GIG Gulf సీఈఓ పాల్ ఆడమ్సన్ స్వయంగా బహ్రెయిన్‌లో జరిగిన వెల్నెస్ వాక్‌లో పాల్గొన్నారు. కలిసి నడవడం వంటి సాధారణ కార్యక్రమాలు ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడంతో పాటు ప్రజల మధ్య సామాజిక సంబంధాలను బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఆరోగ్యమే లక్ష్యం
GIG Gulf చేపడుతున్న ‘Health on Track’ కార్యక్రమం ద్వారా వ్యాధుల నివారణ, ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆరోగ్య ప్రయాణంలో ప్రజలకు అవసరమైన సహకారంపై అవగాహన కల్పిస్తున్నారు. ‘My Wellness Week’ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపేలా, రోజువారీ జీవితంలో మెరుగైన ఆరోగ్య అలవాట్లను పాటించేలా ప్రోత్సహిస్తున్నట్లు సంస్థ తెలిపింది.
బహ్రెయిన్‌తో పాటు యూఏఈ, ఒమన్, ఖతార్లలోనూ ఈ ప్రాంతీయ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతను విస్తృతంగా చాటి చెబుతున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!







