కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- October 13, 2026
కువైట్: నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన డ్రైవర్‌ను కువైట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. సాద్ అల్-అబ్దుల్లా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం కేటాయించిన వాట్సాప్ నంబర్‌కు ఓ ఫిర్యాదు అందింది. ఘటనకు సంబంధించిన వీడియోను కూడా ఫిర్యాదుదారులు పంపించారు.
దీంతో సెక్యూరిటీ కంట్రోల్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన పెట్రోలింగ్ బృందం వెంటనే ఘటనాస్థలికి చేరుకుంది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని, ఘటనకు సమీపంలోనే వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు నిర్వహించిన తనిఖీల్లో.. డ్రైవర్ ప్రమాదకర రీతిలో వాహనాన్ని నడుపుతూ ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినట్లు నిర్ధారణ అయిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుని సెంట్రల్ జైలుకు తరలించారు. వాహనాన్ని కూడా అధికారులు సీజ్ చేశారు.
ట్రాఫిక్ ఉల్లంఘనలు ఫిర్యాదు చేయండి
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రజలు సహకరించాలని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. రోడ్లపై నిర్లక్ష్యపు డ్రైవింగ్ లేదా ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలు కనిపిస్తే, వాటికి సంబంధించిన వీడియోలను వాట్సాప్ నంబర్ 99324092 కు పంపించి ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ప్రజల సహకారంతో ఉల్లంఘనలకు పాల్పడిన వారిని త్వరగా గుర్తించి చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







