ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!

- October 13, 2026 , by Maagulf
ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!

దోహాః ఖతార్‌లోని 974 బీచ్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కుటుంబాలు, నివాసితులు హాజరుకావాలని మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. పిల్లలకు సురక్షితమైన, కుటుంబసభ్యులతో కలిసి ఆనందించే వాతావరణంలో వివిధ వినోద, సృజనాత్మక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, గాలితో నింపిన ఆట పరికరాలు (ఇన్‌ఫ్లేటబుల్స్), బబుల్ షో, ఫేస్ పెయింటింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టికెట్ ధరలు ఇలా ఉన్నాయి:
- ఆరేళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రవేశం.
- దివ్యాంగులకు ఉచిత ప్రవేశం.
- 14 ఏళ్లలోపు పిల్లలకు QR15.
- పెద్దలకు QR35.
- వాహనంతో బీచ్‌లోకి ప్రవేశించేందుకు QR150.
ఫ్యామిలీలు, పిల్లలు కలిసి సరదాగా గడిపేందుకు ఈ కార్యక్రమం అవకాశం కల్పించనుందని నిర్వాహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com