వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- October 13, 2026
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగా, త్వరలోనే వినియోగదారుల ముందుకు మరొక అత్యంత ఉపయోగకరమైన ఫీచర్‌ను తీసుకరాబోతోంది. ఇకపై మెసేజ్‌లను ముందుగానే సిద్ధం చేసుకుని, మనకు కావాల్సిన సమయానికి ఆటోమేటిక్‌గా వెళ్లేలా ‘షెడ్యూల్’ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను కొంతమంది ఆండ్రాయిడ్ బీటా వర్షన్ (Android Beta) వినియోగదారులపై పరీక్షిస్తున్నారు.
14 రోజుల ముందే షెడ్యూలింగ్ సదుపాయం
ఈ కొత్త ఫీచర్ సహాయంతో సాధారణ టెక్స్ట్ మెసేజ్‌లు, వెబ్సైట్ లింకులు, ఫొటోలు, వీడియోలను దాదాపు 14 రోజుల ముందే షెడ్యూల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
ఉదాహరణకు మీ మిత్రులు లేదా కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు అర్ధరాత్రి 12 గంటలకు పంపాలనుకుంటే, మేల్కొని ఉండాల్సిన అవసరం లేదు. ముందుగానే మెసేజ్ టైప్ చేసి షెడ్యూల్ చేస్తే, సరిగ్గా ఆ సమయానికి వాట్సాప్ ఆటోమేటిక్‌గా పంపించేస్తుంది.
మెసేజ్ ఎలా షెడ్యూల్ చేయాలి?
ముందుగా మీరు మెసేజ్ పంపాలనుకున్న చాట్‌లోకి వెళ్ళి మెసేజ్ టైప్ చేయాలి (ఫొటో లేదా వీడియోను కూడా యాడ్ చేయవచ్చు).
ఆ తర్వాత సెండ్ (Send) బటన్‌ను కొద్దిసేపు నొక్కి పట్టుకోవాలి (Long Press).
వెంటనే మీ స్క్రీన్‌పై తేదీ, సమయం ఎంచుకునే ఆప్షన్లు కనిపిస్తాయి.
మీకు కావాల్సిన తేదీ, సమయాన్ని ఎంపిక చేసి షెడ్యూల్ పూర్తి చేయవచ్చు.
ఎడిట్, డిలీట్, గ్రూప్ మెసేజ్ రూల్స్
సవరణ / తొలగింపు: షెడ్యూల్ చేసిన మెసేజ్‌ను నిర్ణీత సమయానికి ముందే మార్చుకోవచ్చు లేదా వద్దనుకుంటే తొలగించవచ్చు. మీరు మెసేజ్ డిలీట్ చేసిన విషయం అవతలి వ్యక్తికి తెలియదు.
గ్రూప్ మెసేజ్‌లు: గ్రూప్‌లో మెసేజ్‌ను షెడ్యూల్ చేసిన సమయానికి సభ్యులుగా ఉన్నవారికి మాత్రమే అది చేరుతుంది. ఆ తర్వాత గ్రూప్‌లో జాయిన్ అయిన కొత్త సభ్యులకు ఆ మెసేజ్ కనిపించదు.
భద్రత: ఈ షెడ్యూల్డ్ మెసేజ్‌లకు కూడా వాట్సాప్‌లో ఉండే సాధారణ మెసేజ్‌ల లాగే ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ రక్షణ ఉంటుంది.
ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంకా పరీక్షల దశలోనే ఉందని, త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్ (iOS) వినియోగదారులందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







