సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- October 14, 2026
కువైట్: సౌదీ సూపర్ కప్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో కువైట్‌లోని T1 విమానాశ్రయ టెర్మినల్‌ను నవంబర్‌లో తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని కువైట్ ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్ ఫహద్ అల్ యూసుఫ్ వెల్లడించారు. జాబర్ అల్ అహ్మద్ అంతర్జాతీయ స్టేడియంలో సౌదీ సూపర్ కప్ ప్రభుత్వ భాగస్వామ్య స్పాన్సర్షిప్ ఒప్పందంపై సంతకాలు చేసిన కార్యక్రమానికి హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టోర్నమెంట్‌కు హాజరయ్యే సౌదీ అభిమానుల రాకపోకలను సులభతరం చేసేందుకు అంతర్గత వ్యవహారాల శాఖ పలు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
నువైసీబ్ సరిహద్దు వద్ద 20 ప్రత్యేక క్యాబిన్లు
సౌదీ నుంచి కువైట్‌కు వచ్చే అభిమానుల ప్రవేశ ప్రక్రియను వేగవంతం చేసేందుకు నువైసీబ్ సరిహద్దు చెక్‌పోస్ట్ సామర్థ్యాన్ని పెంచనున్నారు. ఇందులో భాగంగా ప్రయాణికుల కోసం 20 ప్రత్యేక క్యాబిన్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీంతో సరిహద్దు వద్ద రద్దీ తగ్గి, ప్రయాణికుల తనిఖీలు మరింత సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంది.
సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌ల్లో పాల్గొనే ఆటగాళ్లు, జట్ల పరిపాలనా సిబ్బందికి విమానాశ్రయంలో బయోమెట్రిక్ వేలిముద్రల నమోదు ప్రక్రియ నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇందుకు బదులుగా వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు.ఈ కార్డుల ద్వారా ఆటగాళ్లు, సిబ్బంది కువైట్‌లోకి ప్రవేశించడం, తిరిగి బయటకు వెళ్లడం సులభతరం కానుంది.
అభిమానులకు ప్రయాణ సౌకర్యాలు
టోర్నమెంట్‌కు వచ్చే జట్లు, అధికారులు, అభిమానులకు ప్రయాణ ప్రక్రియను సులభతరం చేయడం, విమానాశ్రయాలు, సరిహద్దుల వద్ద రద్దీని నియంత్రించడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. సౌదీ సూపర్ కప్ నిర్వహణకు ముందే విమానాశ్రయ టెర్మినల్ పునఃప్రారంభం, సరిహద్దు వద్ద అదనపు సదుపాయాల ఏర్పాటు ద్వారా క్రీడాభిమానులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించేందుకు కువైట్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు.
తాజా వార్తలు
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు







