భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- October 14, 2026
ప్రపంచ రాజకీయాల్లో రోజురోజుకూ చోటుచేసుకుంటున్న మార్పులు అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికాతో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇతర దేశాలతో వ్యవహరించే తీరులో మార్పులు వస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో ప్రతి దేశం ఆ దేశంతో తన సంబంధాలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్ స్వతంత్ర నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తోంది
అమెరికాతో భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని జైశంకర్ పేర్కొన్నారు. అయితే వ్యూహాత్మక భాగస్వామ్యం అంటే అధికారిక కూటమిలో భాగం కావడం కాదని స్పష్టం చేశారు. అమెరికాతో సంబంధాలను కొనసాగిస్తూనే చైనాతో వ్యవహరించడం, యూరప్‌తో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడం, రష్యాతో సంబంధాలను కొనసాగించడం భారత్ విదేశాంగ విధానంలో కీలకమని వివరించారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ తన స్వతంత్ర నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తోందనే విషయాన్ని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
భారత్-అమెరికా వాణిజ్య చర్చల పై ఏమన్నారంటే?
భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయని జైశంకర్ తెలిపారు. ఇరు దేశాల వాణిజ్య ప్రతినిధులు ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం, రాజకీయాల్లో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో.. భారత్ తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఇతర దేశాలతో సంబంధాలను కొనసాగించడంపై దృష్టి సారిస్తోందని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







