ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం

- October 14, 2026 , by Maagulf
ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం

న్యూ ఢిల్లీ: ఢిల్లీ పోలీసుల పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన ఎన్‌ఎస్‌యూఐతోపాటు, ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులపై పోలీసులు తీవ్రంగా దాడి చేశారని రాహుల్ ఆరోపించారు. అందులోనూ మహిళా విద్యార్థులపై దాడి చేశారని, పోలీసుల దాడుల్లో గాయపడ్డ ఒక విద్యార్థినికి వినికిడి సమస్య ఎదురైందని రాహుల్ విమర్శించారు. మరో విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ, ఇండియా బ్లాక్, సీజేపీ, ఆప్, ఇతర విద్యార్థి సంఘాలు ఢిల్లీలో కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం ఆందోళన చేసిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు దాడికి పాల్పడ్డారు. వీరిలో కేరళకు చెందిన అథిర అనే ఒక విద్యార్థినిపై దాడి జరగగా.. ఆమె ఒక చెవి వినికిడి శక్తి సమస్య ఎదుర్కొంటున్నట్లు రాహుల్ గాంధీ మీడియాకు తెలిపారు. ఆమె చెవిపై పోలీసులు దాడి చేయడం వల్ల ఒకవైపు వినికిడి శక్తి కోల్పోయిందన్నారు.

బస్సులో మహిళా పోలీసు అధికారులే లేరని
గతంలో ఇలాగే, పోలీసుల దాడుల్లో కంటి చూపు కోల్పోయిన ఒక అబ్బాయిని చూపించానని, ఈసారి దాడుల్లో ఇంకొకరికి చెవుడు వచ్చిందని రాహుల్ ఆరోపించారు. బాధిత యువతిని రాహుల్ మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా బాధిత యువతి మీడియాతో మాట్లాడింది. తమను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారని, ఈ సమయంలో మహిళా పోలీసులు తమతో లేరని ఆరోపించారు. అలాగే, తమను తీసుకెళ్తున్న బస్సును కన్నాట్ పోలీస్ స్టేషన్ వద్ద ఆపి, తమపై వరుసగా దాడి చేశారని ఆమె పేర్కొన్నారు. కేరళకు చెందిన తాను ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుంటున్నట్లు చెప్పారు. తమను అరెస్టు చేసి తీసుకెళ్తున్న బస్సులో మహిళా పోలీసు అధికారులే లేరని ఆరోపించారు. మరికొందరు విద్యార్థినులపై మహిళా కానిస్టేబుళ్లు దాడి చేసినట్లు రాహుల్ వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com