తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్

- October 15, 2026 , by Maagulf
తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ డీజీపీ సీ.వి. ఆనంద్ పాల్గొని మహిళా పోలీసు సిబ్బందితో కలిసి బతుకమ్మ సంబరాల్లో భాగస్వాములయ్యారు.

తెలంగాణ సంస్కృతి, ప్రకృతి వైభవాన్ని ప్రతిబింబించే బతుకమ్మ పండుగ సందర్భంగా వివిధ హోదాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసు సిబ్బంది ఒక్కచోట చేరి, చప్పట్లు కొడుతూ సంప్రదాయ బతుకమ్మ పాటలు ఆలపించారు. దీంతో పోలీస్ ప్రధాన కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా డీజీపీ సీ.వి. ఆనంద్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ, బోనాలు వంటి పండుగలకు మరింత విస్తృత గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.
తన చిన్ననాటి బతుకమ్మ వేడుకలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రతి ఏడాది దసరా సెలవుల్లో నల్గొండ జిల్లాలోని తన అమ్మమ్మ గ్రామమైన దోతుగూడెంలో బతుకమ్మ పండుగను జరుపుకునేవారమని తెలిపారు. తన తల్లి, బంధువులతో కలిసి గ్రామంలోని చెరువు వద్దకు వెళ్లి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేవారమని, ఆ జ్ఞాపకాలు తనకు ఎంతో ప్రత్యేకమైనవని ఆయన భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు.బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ పోలీసు శాఖలోని మహిళా సిబ్బందితో పాటు రాష్ట్ర ప్రజలందరికీ డీజీపీ సీ.వి. ఆనంద్ శుభాకాంక్షలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com