ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- October 15, 2026
అమెరికా: అమెరికా, ఇరాన్ల మధ్య కొన్ని నెలలుగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నవంబర్ నాటికి ప్రత్యక్ష యుద్ధానికి దారితీసే అవకాశం ఉందనే వార్తలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇరాన్ (Iran) లోని అత్యంత కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలు, భూగర్భ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడానికి అమెరికా రక్షణ శాఖ నూతన సైనిక ప్రణాళికలను రూపొందించింది. రాబోయే అమెరికా మధ్యంతర ఎన్నికల (నవంబర్ 3) పోలింగ్ ముగిసిన వెంటనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఆదేశాలు వెలువడితే తక్షణమే విరుచుకుపడేలా అమెరికా దళాలు సన్నద్ధమవుతున్నాయి.
మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్'
ఈ దాడి ప్రణాళికలో అమెరికా సైనిక ఆయుధాగారంలోనే అత్యంత శక్తివంతమైన అణ్వాయుధేతర బాంబు అయిన “మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్” (MOAB) ను ఉపయోగించే అవకాశాలను ట్రంప్ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించకుండా నిరోధించడమే తమ ప్రధాన లక్ష్యమని చెబుతున్న ట్రంప్ యంత్రాంగం.. ఇరాన్కు చెందిన అనుమానిత ‘పికాక్స్ పర్వతం’ (Pickaxe Mountain) అణు కేంద్రాన్ని ధ్వంసం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించింది. గ్రానైట్ పర్వతాల లోతుల్లో ఉన్న ఈ స్థావరాలపై ప్రాథమిక దాడులు ప్రభావం చూపకపోవడంతో MOAB ని ప్రయోగించాలని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







