సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!

- October 15, 2026 , by Maagulf
సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!

రియాద్‌: సౌదీ అరేబియాలో నిర్వహించే అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్‌ ‘సిక్స్ కింగ్స్ స్లామ్‌’ మూడో ఎడిషన్‌ వాయిదా పడింది. తొలుత అక్టోబర్ 21, 22, 24 తేదీల్లో జరగాల్సిన ఈ టోర్నమెంట్‌ను డిసెంబర్ 27 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు రియాద్‌ సీజన్‌ ప్రకటించింది.

టోర్నమెంట్‌ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, లాజిస్టిక్స్‌ పరమైన సవాళ్లను సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అంశాలు ప్రేక్షకుల అనుభవం, పోటీల నాణ్యతపై ప్రభావం చూపకుండా చూడటమే వాయిదా నిర్ణయం వెనుక ఉద్దేశమని పేర్కొన్నారు. అత్యున్నత ప్రమాణాలతో క్రీడా కార్యక్రమాలను నిర్వహించాలనే నిబద్ధతతోనే కొత్త తేదీలను ఖరారు చేసినట్లు రియాద్‌ సీజన్‌ వెల్లడించింది.

టోర్నమెంట్‌పై ఆసక్తి చూపుతున్న ఆటగాళ్లు, భాగస్వామ్య సంస్థలు, సౌదీ అరేబియాతో పాటు ఇతర దేశాలకు చెందిన టెన్నిస్‌ అభిమానులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త తేదీల్లో టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా ప్రపంచస్థాయి క్రీడా అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

టోర్నమెంట్‌కు సంబంధించిన తాజా సమాచారం, సందేహాల కోసం Ehtemam Center‌ను సంప్రదించవచ్చని తెలిపింది.

టోల్‌ ఫ్రీ నంబర్‌: 8001282222, వెబ్‌సైట్‌: Ehtemam.sa

టెన్నిస్‌ అభిమానులు తమ షెడ్యూల్‌ను కొత్త తేదీలకు అనుగుణంగా మార్చుకోవాలని నిర్వాహకులు సూచించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com