ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- October 15, 2026
మస్కట్: ఒమన్‌లోని అల్ వుస్తా గవర్నరేట్ పరిధిలో పడవ ప్రమాదానికి గురైంది. అల్ దుక్మ్ విలాయత్‌లోని ఓ బీచ్ తీరంలో రాళ్లను ఢీకొనడంతో పడవ దెబ్బతిని, సముద్ర తీరానికి మరియు రాతి ప్రాంతానికి మధ్య చిక్కుకుపోయింది. ఈ ఘటనలో పడవలో ఉన్న పలువురు పౌరులకు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) కోస్ట్‌గార్డ్ సిబ్బంది సహాయం అందించారు.
రాయల్ ఒమన్ పోలీసుల వివరాల ప్రకారం.. అల్ వుస్తా గవర్నరేట్ కోస్ట్‌గార్డ్ సిబ్బందికి పడవ ప్రమాదం గురించి సమాచారం అందింది. దీంతో వెంటనే స్పందించిన సిబ్బంది, పడవలో ఉన్నవారికి అవసరమైన సహాయాన్ని అందించారు. రాళ్లను ఢీకొనడంతో పడవ దెబ్బతిని, తీరానికి సమీపంలోని రాతి ప్రాంతం వద్ద నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. పడవలో ఉన్న పౌరులకు అవసరమైన సహాయం అందించినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఇతర వివరాలను అధికారులు వెల్లడించలేదు.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







