దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- October 15, 2026
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టిన వేడుకలు.. భారీగా తరలివచ్చిన తెలంగాణ ప్రవాసులు
దుబాయ్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గల్ఫ్ తెలంగాణ ఫోరం (జీటీఎఫ్) ఆధ్వర్యంలో అక్టోబర్ 11న దుబాయ్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. విదేశీ గడ్డ పై తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించి తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పారు. ఈ వేడుకల్లో దుబాయ్తో పాటు యూఏఈలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రవాసులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి భారత కాన్సులేట్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ నుంచి విచ్చేసిన మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే గణేశ్ బీగాల, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు మహేశ్ బీగాల, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు అయేషా షకీల్ తదితర ప్రముఖులు పాల్గొని వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
జీటీఎఫ్ బృందం సమష్టి కృషి
జీటీఎఫ్ ఫౌండర్, ప్రెసిడెంట్ ఆకుల సురేందర్ పటేల్ ఆధ్వర్యంలో జనరల్ సెక్రటరీలు బాలరాజ్ గౌడ్, యజువేండర్, వైస్ ప్రెసిడెంట్లు ఏదునూరి శ్రీకాంత్, రాజేశ్, సలహాదారు రాజేశ్వర్, కోర్ కమిటీ సభ్యులు అభినవ్, చంద్రకాంత్ గుప్తా, రవన్నతో పాటు సంస్థ కోఆర్డినేటర్లు, కార్యవర్గ సభ్యులు, వాలంటీర్లు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
మహిళా విభాగం నుంచి కోర్ కమిటీ సభ్యులు కళ్యాణి, లక్ష్మీ, కల్పన, మమత, ఉషశ్రీ, వైదేవి, వేద, స్వాతి, లక్ష్మీ తదితరులు చురుకుగా పాల్గొన్నారు. అలాగే యాక్టివ్ కమిటీ సభ్యులు సతీశ్ రెడ్డి, గోపన్నగారి చంద్రశేఖర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ప్రశాంత్, మహేశ్, రాజ్కుమార్తో పాటు జీటీఎఫ్ సభ్యులందరూ వేడుకల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.
పూల బతుకమ్మలు.. ఆటపాటలతో పండుగ సందడి
రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలు, తెలంగాణ మహిళల సంప్రదాయ ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. తెలంగాణ పల్లె సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేస్తూ చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తమ సంస్కృతిని మరచిపోకుండా సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పండుగను జరుపుకోవడం విశేషంగా నిలిచింది.
కార్యక్రమానికి హాజరైన అతిథులు, తెలంగాణ నాయకులు, ప్రవాసులు, వారి కుటుంబ సభ్యుల కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సంప్రదాయ వంటకాలతో విందు భోజనాలు ఏర్పాటు చేసి, అందరికీ ఆత్మీయ ఆతిథ్యం అందించారు.
భావితరాలకు తెలంగాణ సంస్కృతిని పరిచయం చేయడమే లక్ష్యం
విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలకు తమ భాష, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలను భావితరాలకు పరిచయం చేయడమే జీటీఎఫ్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ లక్ష్యంతో సంస్థ నిరంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోందని పేర్కొన్నారు.
బతుకమ్మ సంబరాలను విజయవంతం చేసిన అతిథులు, తెలంగాణ ప్రజాప్రతినిధులు, మహిళలు, యువత, కుటుంబ సభ్యులు, దాతలు, స్పాన్సర్లు, వాలంటీర్లకు జీటీఎఫ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జీటీఎఫ్ ఫౌండర్, ప్రెసిడెంట్ ఆకుల సురేందర్ పటేల్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి సమష్టి కృషి, సహకారం, ఆత్మీయత వల్లే బతుకమ్మ సంబరాలు ఇంతటి ఘనవిజయాన్ని సాధించాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ జీటీఎఫ్ కుటుంబంలో సభ్యులేనని తెలిపారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రవాసులంతా ఐక్యంగా కృషి చేయాలని, రాబోయే తరాలకు తెలంగాణ వారసత్వాన్ని అందించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.




తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







