BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- October 15, 2026
బహ్రెయిన్: రోజుకు BD30 చెల్లించి అద్దెకు తీసుకున్న కారుతో మద్యం మత్తులో ప్రమాదానికి కారణమైన ఓ గల్ఫ్ దేశ పౌరుడికి భారీ జరిమానా విధిస్తూ బహ్రెయిన్ హై సివిల్ కోర్టు తీర్పునిచ్చింది. కారు దెబ్బతినడంతో అద్దె సంస్థకు BD6,204.570 నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. దీనికి అదనంగా 3 శాతం చొప్పున చట్టపరమైన వడ్డీ కూడా చెల్లించాలని స్పష్టం చేసింది.
అద్దెకు తీసుకున్న కొన్ని గంటల్లోనే ప్రమాదం
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ వివరాల ప్రకారం.. సదరు వ్యక్తి రోజుకు BD30 చెల్లించి కారును అద్దెకు తీసుకున్నాడు. అయితే, కొన్ని గంటల్లోనే మద్యం మత్తులో వాహనం నడుపుతూ ట్రాఫిక్కు వ్యతిరేక దిశలో ప్రయాణించాడు. ఈ క్రమంలో మరో వాహనాన్ని ఢీకొట్టాడు. డ్రైవింగ్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో జరిగిన ఈ ప్రమాదంలో అద్దె కారు తీవ్రంగా దెబ్బతింది. మరమ్మతుల ఖర్చు BD6,000 దాటింది.
బీమా నిరాకరణ..
డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపినట్లు తేలడంతో బీమా సంస్థ ప్రమాదానికి సంబంధించిన నష్టాన్ని భరించేందుకు నిరాకరించింది. దీంతో అద్దె కారు సంస్థ నష్టపరిహారం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తన వాదనకు మద్దతుగా కారు అద్దె ఒప్పందం, ప్రమాద నివేదిక, ఫొటోలు, మరమ్మతుల అంచనా వ్యయానికి సంబంధించిన పత్రాలను కోర్టుకు సమర్పించింది.
హాజరుకాని నిందితుడు..
కోర్టు విచారణకు నిందితుడు హాజరుకాలేదు. తన తరఫున ఎలాంటి సమాధానం లేదా ప్రతివాదనను కూడా సమర్పించలేదు. అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం ప్రమాదానికి అతడే బాధ్యుడని నిర్ధారించింది. దీంతో అద్దె కారు సంస్థకు BD6,204.570 నష్టపరిహారంతో పాటు 3 శాతం చట్టపరమైన వడ్డీ చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







