నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- October 16, 2026
న్యూ ఢిల్లీ: ఢిల్లీ, ముంబైలో అక్టోబర్ 16న జరగనున్న ‘లెహ్రా దో తిరంగా’ నిరసన కార్యక్రమాల నేపథ్యంలో రాజకీయంగా ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీ పోలీసులు తనను త్వరలో అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. నిఘా విభాగం అధికారులు తనపై నిఘా పెట్టారని, నంబర్ ప్లేట్లు లేని వాహనాలు తనను అనుసరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
త్రివర్ణ పతాకం కోసం జైలుకైనా సిద్ధం: దీప్కే
గురువారం రాత్రి మీడియాతో మాట్లాడిన దీప్కే.. జాతీయ జెండాను ఎగురవేయడానికి జైలుకు వెళ్లాల్సి వచ్చినా వెనక్కి తగ్గబోమని అన్నారు. పోలీసులు తనను రాత్రి లేదా శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకోవచ్చని, అయినప్పటికీ శాంతియుతంగా త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తామని తెలిపారు. తమ పార్టీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను అరెస్టు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించి, స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా కొత్త ఎన్నికల కమిషనర్‌ను నియమించాలని మాత్రమే కోరుతున్నామని దీప్కే చెప్పారు. ప్రభుత్వాన్ని మార్చాలని తాము డిమాండ్ చేయడం లేదని స్పష్టం చేశారు.
ఢిల్లీలోని సెంట్రల్ పార్క్ రెండు రోజులు మూసివేత
ఢిల్లీలోని కనాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్‌లో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జాతీయ జెండాలతో నిరసన చేపట్టాలని CJP పిలుపునిచ్చింది. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ తెలిపింది. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) అక్టోబర్ 16, 17 తేదీల్లో సెంట్రల్ పార్క్‌ను ప్రజలకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, పార్క్ మూసివేతకు పరిపాలనా కారణాలనే అధికారికంగా పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై దీప్కే స్పందిస్తూ.. రేపు దేశవ్యాప్తంగా 100 ప్రాంతాల్లో త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తామని చెబితే, ఆ ప్రాంతాలన్నింటినీ మూసివేస్తారా? అని ప్రశ్నించారు.
ఢిల్లీలో భారీ భద్రత..11 మందికే అనుమతి
కనాట్ ప్లేస్ పరిసరాల్లో సుమారు 6,000 మంది ఢిల్లీ పోలీసులు, పారామిలటరీ సిబ్బందిని మోహరించినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ నిరసనను అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. నిరసనను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించకుండా, సభను చట్టపరంగా నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇచ్చిన హామీని కోర్టు నమోదు చేసుకుంది. అనంతరం, కనాట్ ప్లేస్, పరిసర ప్రాంతాల్లో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పోలీసులు తెలిపారు. సెంట్రల్ పార్క్‌లో అనువైన ప్రదేశంలో కేవలం 11 మంది మాత్రమే జాతీయ జెండాను పట్టుకుని, జాతీయ గీతాన్ని ఆలపించేందుకు అనుమతించగలమని పేర్కొన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్‌పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్‌లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!







