‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

- October 16, 2026 , by Maagulf
‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

హైదరాబాద్: ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల (గ్రాడ్యుయేట్స్) ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి జనసేన పార్టీ పూర్తిస్థాయిలో సమాయత్తమైంది. ఈ ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ ప్రచార రథాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గడల శ్రీనివాసరావుకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై ఆయనకు పలు కీలక సూచనలు, దిశానిర్దేశం చేశారు.

గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ లక్ష్యం ఇదే!

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ కేవలం ఎన్నికల ప్రచార వాహనానికే పరిమితం కాకూడదని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత, పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలను నిరంతరం తెలుసుకోవాలి. ఆ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే ఒక ప్రజాసేవా వేదికగా ఈ వాహనం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

మొత్తానికి హైదరాబాద్‌లోని జనసేన హెడ్‌ఆఫీస్ నుంచి ప్రారంభమైన ఈ ‘గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’తో ఖమ్మం, నల్గొండ, వరంగల్ నియోజకవర్గాల్లో జనసేన ప్రచారం మరింత జో అందుకోనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com