ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- October 17, 2026
ఫుజైరా: యూఏఈలోని ఫుజైరా తీరంలో స్వల్ప భూకంపం నమోదైంది. దిబ్బా అల్ ఫుజైరా తీరానికి సమీపంలో అక్టోబర్ 16న రాత్రి 9:38 గంటలకు భూకంపం సంభవించినట్లు యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్సీఎం) వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 1.6గా నమోదైనట్లు తెలిపింది.
యూఏఈ జాతీయ భూకంప పర్యవేక్షణ నెట్వర్క్ ఈ ప్రకంపనలను గుర్తించింది. దేశవ్యాప్తంగా, పరిసర ప్రాంతాల్లో భూకంప కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించే ఈ వ్యవస్థ ద్వారా భూకంప తీవ్రతను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.అయితే, అందుబాటులో ఉన్న నివేదికలో భూకంపం వల్ల ఎలాంటి నష్టం సంభవించిందనే వివరాలు వెల్లడించలేదు. ఈ ప్రకంపనలకు సంబంధించి మరిన్ని వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది.
తాజా వార్తలు
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం







