తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌, కేసీఆర్

- October 18, 2026 , by Maagulf
తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌, కేసీఆర్

హైదరాబాద్: సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరియు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆడబిడ్డలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బతుకమ్మ శుభాకాంక్షలు

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు, ఆడబిడ్డల ఆరాధనకు బతుకమ్మ నిలువెత్తు నిదర్శనమని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటా సంతోషాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. తీరొక్క పూలతో, అత్యంత వైభవంగా నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకలను ఆడబిడ్డలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సీఎం కోరారు. పండుగ వేళ ప్రతి ఇంట్లో సిరిసంపదలు, సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు.

మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com