క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- October 18, 2026
దోహా: క్యాంపింగ్ సీజన్ నేపథ్యంలో కారవాన్లు, ట్రైలర్లను తరలించే సమయాలను ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ప్రకటించింది. రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సమయాలను నిర్దేశించడంతో పాటు వాహనదారులు పాటించాల్సిన నిబంధనలను వెల్లడించింది.
మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం నుంచి బుధవారం వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కారవాన్లు, ట్రైలర్లను తరలించేందుకు అనుమతి ఉంటుంది. గురువారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది.కారవాన్లు, ట్రైలర్లను లాగే వాహనదారులు రహదారిపై కుడివైపు లేన్‌లోనే ప్రయాణించాలని అధికారులు సూచించారు. పొగమంచు లేదా విజిబిలిటీ తక్కువగా ఉన్న సమయంలో వాటిని తరలించవద్దని స్పష్టం చేశారు.
అలాగే, కారవాన్లు, ట్రైలర్లను లాగుతూ ప్రయాణించే సమయంలో ఇతర వాహనాలను ఓవర్టేక్ చేయకూడదని సూచించారు. క్యాంపింగ్ సీజన్లో ఈ వాహనాలతో ప్రయాణించేవారు ఆర్బిటల్ హైవే, దానికి అనుసంధానమైన రహదారులను వినియోగించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, ప్రయాణికుల భద్రతను కాపాడేందుకు వాహనదారులు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







