ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- October 18, 2026
మస్కట్: ఒమన్‌లోని అల్ అవాబి ప్రాంతంలో ఓ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన సౌత్ అల్ బతీనా గవర్నరేట్ పరిధిలోని విలాయత్ అల్ అవాబిలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అగ్నిప్రమాదంలో గాయపడిన ఆరుగురిని చికిత్స నిమిత్తం ఆరోగ్య కేంద్రాలకు తరలించారు.
ఈ ఘటనపై ఒమన్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడంతో పాటు, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







