లోక్ భవన్‌లో గవర్నర్ ఆయుధ పూజలు

- October 18, 2026 , by Maagulf
లోక్ భవన్‌లో గవర్నర్ ఆయుధ పూజలు
హైదరాబాద్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని  రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ఆదివారం ఉదయం లోక్ భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత ఎలక్ట్రిసిటీ విభాగం కార్యాలయంలో దుర్గామాతకు పూజలు నిర్వహించారు. అనంతరం లోక్ భవన్ ప్రాంగణంలోని పోచమ్మ తల్లికి పూజలు చేసి, భద్రతా విధుల్లో వినియోగించే ఆయుధాలకు  సంప్రదాయబద్ధంగా ఆయుధ పూజ నిర్వహించారు. గ్యారేజ్ లో అధికారిక వాహనాలకు గవర్నర్  పూజలు చేశారు.
 
అనంతరం లోక్ భవన్ అధికారులు, సిబ్బందితో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది గవర్నర్‌కు బతుకమ్మ, నవరాత్రి, విజయదశమి పండుగల శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిగా గవర్నర్ కూడా వారందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. బతుకమ్మ, నవరాత్రి, విజయదశమి పండుగలను భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని గవర్నర్ సూచించారు. ఈ పండుగలు ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను తీసుకురావాలని ఆకాంక్షించారు.
 
ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిషోర్, సంయుక్త కార్యదర్శి  కొమండూరు శశి కిరణ్, ADC కాంతి లాల్, చీఫ్ సెక్యూరిటీ అధికారులు శ్రీనివాస్, మట్టయ్య, ప్రెస్ సెక్రటరీ మామిండ్ల దశరథం, లోక్ భవన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ. చంద్ర మోహన్, గ్యారేజ్ సూపర్‌వైజర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com