కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్‌లో చర్చలు

- October 18, 2026 , by Maagulf
కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్‌లో చర్చలు

మిడిల్ ఈస్ట్ భద్రత, ప్రాంతీయ స్థిరత్వంపై ఇరు దేశాల నేతల సమాలోచనలు
అబుదాబి: యూఏఈ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ కువైట్ విదేశాంగ మంత్రి షేక్ జర్రాహ్ జాబర్ అల్ అహ్మద్ అల్ సబాతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలతో పాటు మధ్యప్రాచ్యంలో భద్రత, స్థిరత్వాన్ని బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యల పై ఇరువురు చర్చించారు.
యూఏఈ, కువైట్ దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక సోదర సంబంధాలకు సంబంధించిన పలు అంశాలను కూడా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సమీక్షించారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.

మిడిల్ ఈస్ట్ లో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించేందుకు ఇరు దేశాల మధ్య సంప్రదింపులు, సహకారాన్ని కొనసాగించడంపై ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com