సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!

- October 18, 2026 , by Maagulf
సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!

జెడ్డా: సౌదీ అరేబియాలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం నేపథ్యంలో నాలుగు ప్రాంతాల్లో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. జజాన్, అసీర్, అల్ బహా, మక్కా ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాలకు ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉందని సౌదీ జాతీయ వాతావరణ కేంద్రం (NCM) హెచ్చరించింది. ఆయా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతోపాటు వడగళ్ల వాన, బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. గాలుల కారణంగా దుమ్ము, ఇసుక వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించారు.

జజాన్, అసీర్, అల్ బహా, మక్కా ప్రాంతాల్లోని ప్రభావిత ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు ప్రావిన్స్‌లోని తీర ప్రాంతాల్లోనూ పొగమంచు కమ్ముకునే సూచనలు ఉన్నాయని పేర్కొంది.ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ముప్పు ఉన్న ప్రాంతాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జాతీయ వాతావరణ కేంద్రం సూచించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com