ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- October 19, 2026
దోహా: ఖతార్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్లో అక్టోబర్ 11 నుంచి 17 వరకు జరిగిన ప్రాపర్టీ సేల్స్ విలువ QR696.5 మిలియన్లకు చేరింది. ఇదే సమయంలో తనఖా లావాదేవీల విలువ QR861.7 మిలియన్లుగా నమోదైంది. అలాగే 428 అద్దె ఒప్పందాలు రిజిస్టర్ అయ్యాయి. ఖతార్ రియల్ ఎస్టేట్ నియంత్రణ సంస్థ అకారత్ (Aqarat), న్యాయశాఖ, మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ గణాంకాల ఆధారంగా ఈ వివరాలను వెల్లడించింది. మొత్తం 131 రియల్ ఎస్టేట్ విక్రయ లావాదేవీలు జరిగాయి. వీటి విలువ అంతకుముందు వారంతో పోలిస్తే 15.6% పెరిగింది. అయితే గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12.3% తగ్గింది. లావాదేవీల సంఖ్య వారంవారీగా 7.1%, ఏడాది ప్రాతిపదికన 11.5% తగ్గింది.
ప్రాపర్టీ రకాలను పరిశీలిస్తే విల్లాల సేల్స్ అత్యధికంగా QR197.6 మిలియన్లుగా నమోదయ్యాయి. ఇవి మొత్తం విక్రయాల విలువలో 28.4% వాటాను కలిగి ఉన్నాయి. ఖాళీ స్థలాల విక్రయాలు QR190.5 మిలియన్లతో 27.4% వాటా సాధించాయి. రెసిడెన్షియల్ ప్రాపర్టీ సేల్స్ QR162.8 మిలియన్లుగా నమోదై 23.4% వాటాను పొందాయి. ఇతర ఆస్తుల విక్రయాల విలువ QR145.6 మిలియన్లుగా ఉండగా, వాటా 20.9%గా ఉంది.
అల్ దాయెన్లో అత్యధిక సేల్స్
మున్సిపాలిటీల వారీగా అల్ దాయెన్ QR239.5 మిలియన్ల విక్రయ విలువతో ముందంజలో నిలిచింది. మొత్తం విక్రయాల్లో ఈ ప్రాంతం వాటా 38.6%గా ఉంది. దోహా QR209.3 మిలియన్లతో 33.8% వాటా సాధించగా, అల్ రయ్యాన్ QR170.9 మిలియన్లతో 27.6% వాటాను నమోదు చేసింది.
మార్టిగేజ్ లావాదేవీలు 18 నమోదయ్యాయి. వీటి మొత్తం విలువ QR861.7 మిలియన్లకు చేరింది. అంతకుముందు వారంతో పోలిస్తే తనఖా లావాదేవీల విలువ 652.2% పెరిగింది. అయితే గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 36.7% తగ్గింది. లావాదేవీల సంఖ్య వారంవారీగా 33.3%, ఏడాది ప్రాతిపదికన 14.3% తగ్గింది. ఆస్తుల రకం ఆధారంగా మార్టిగేజ్ వివరాల్లో భూముల విలువ QR756 మిలియన్లుగా, భవనాల విలువ QR729 మిలియన్లుగా, ఇతర ఆస్తుల విలువ QR111 మిలియన్లుగా పేర్కొన్నారు. వీటి వాటాలు వరుసగా 47.4%, 45.7%, 7%గా నమోదయ్యాయి. మున్సిపాలిటీల వారీగా అల్ రయ్యాన్ QR749 మిలియన్ల తనఖా విలువతో మొదటి స్థానంలో నిలిచింది. అల్ దాయెన్ QR78 మిలియన్లు, దోహా QR19 మిలియన్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
రెంటల్ ఒప్పందాల విలువ QR4.17 మిలియన్లు
అక్టోబర్ 11 నుంచి 17 వరకు మొత్తం 428 అద్దె ఒప్పందాలు నమోదయ్యాయి. వీటి అద్దె విలువ QR4.17 మిలియన్లుగా ఉంది. అంతకుముందు వారంతో పోలిస్తే అద్దె విలువ 45.1% తగ్గగా, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 74.5% పడిపోయింది. రెంటల్ ఒప్పందాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. వారంవారీగా 58.9%, ఏడాది ప్రాతిపదికన 77.7% క్షీణత నమోదైంది. ఆస్తుల రకాల్లో విల్లాల అద్దె విలువ QR1.96 మిలియన్లుగా ఉండి, మొత్తం అద్దె విలువలో 47.1% వాటాను సాధించింది. అపార్ట్మెంట్ల అద్దె విలువ QR1.20 మిలియన్లు కాగా, వాణిజ్య దుకాణాల అద్దె విలువ QR700,000గా నమోదైంది. ఇతర ఆస్తుల అద్దె విలువ QR300,000గా ఉంది. మున్సిపాలిటీల వారీగా దోహా QR1.54 మిలియన్ల అద్దె విలువతో అగ్రస్థానంలో నిలిచింది. అల్ రయ్యాన్ QR1.46 మిలియన్లు, ఉమ్ సలాల్ QR450,000తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
అక్టోబర్ లో QR458 మిలియన్ల విక్రయాలు
2026లో 41వ వారంగా పేర్కొన్న అక్టోబర్ 4 నుంచి 10 మధ్య ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయ ఒప్పందాల మొత్తం విలువ QR458 మిలియన్లుగా నమోదైంది. అంతకుముందు వారంతో పోలిస్తే ఇది 14% తగ్గగా, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 28.1% తగ్గింది. ఆ వారంలో మొత్తం 111 విక్రయ ఒప్పందాలు నమోదయ్యాయి. వీటిలో విల్లాల విక్రయ విలువ QR221 మిలియన్లుగా ఉండి, మొత్తం విక్రయాల్లో 48.3% వాటాను సాధించింది. ఖాళీ స్థలాల విక్రయాలు QR121.2 మిలియన్లతో 26.5% వాటా పొందాయి. నివాస అపార్ట్మెంట్ల విక్రయాలు QR37.7 మిలియన్లుగా నమోదై 8.2% వాటాను కలిగి ఉన్నాయి. ఇతర ఆస్తుల విక్రయాల విలువ QR78 మిలియన్లుగా ఉండి, 17% వాటాను నమోదు చేసింది. ఇదే వారంలో 27 మార్టిగేజ్ ఒప్పందాలు నమోదయ్యాయి. వీటి మొత్తం విలువ QR114.56 మిలియన్లుగా ఉంది.
ఖతార్ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి చెందుతుండటంతో రియల్ ఎస్టేట్ రంగంలో నివాసితులు, పెట్టుబడిదారులకు పలు అవకాశాలు అందుబాటులో ఉన్నాయని మార్కెట్ గణాంకాలు సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- ఒమన్‌లో రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు.. డ్రైవర్ అరెస్ట్..!!
- హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదం.. మదీనా క్రాస్‌రోడ్డు బట్టల గోడౌన్లో ఎగసిపడ్డ మంటలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!
- మస్కట్‌లో అక్టోబర్ 28 నుంచి ఆర్ట్ ఎగ్జిబిషన్–2026..!!







