నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు

- October 19, 2026 , by Maagulf
నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు

ఒంగోలు: ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీలను మార్చినట్లు పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు.

ప్రకాశం జిల్లా ఒంగోలులోని నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించనున్న ఈ మహాసభలను తొలుత డిసెంబర్ 5, 6 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించగా, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనూ, పలు ప్రవాస తెలుగు సంఘాల ప్రత్యేక అభ్యర్థనల మేరకూ 2026 డిసెంబర్ 19, 20 తేదీలకు మార్చినట్లు ఆయన వెల్లడించారు.

తెలుగు భాషా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడంతో పాటు బాలబాలికల్లో తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళల పట్ల ఆసక్తిని పెంపొందించడమే ఈ మహాసభల ప్రధాన లక్ష్యమని డా. గజల్ శ్రీనివాస్ పేర్కొన్నారు.

ఈ మహాసభలకు దేశవిదేశాల నుంచి పలువురు ప్రముఖులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు హాజరుకానున్నారని తెలిపారు. ముఖ్యంగా 16 సంవత్సరాలలోపు బాలబాలికలు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వేలాదిగా పాల్గొని తమ సాహిత్య, సాంస్కృతిక, కళా ప్రతిభను ప్రదర్శించనున్నారని మహాసభల సమన్వయకర్తలు డా. కె. మురళీధర్ రెడ్డి, శ్రీ కోగంటి శ్రీకాంత్ వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, బాలబాలికలు మారిన తేదీలను గమనించి, ఈ మహాసభలను విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com