జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్‌వేస్..!!

- October 20, 2026 , by Maagulf
జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్‌వేస్..!!

దోహా: సౌదీ అరేబియాలోని జెడ్డా (JED)కు రాకపోకలు సాగించే విమాన సర్వీసులను తగ్గిస్తున్నట్లు ఖతార్ ఎయిర్‌వేస్ ప్రకటించింది. ప్రస్తుతం రోజుకు 7 విమానాలు నడుపుతుండగా, ఇకపై రోజుకు 4 విమానాలను మాత్రమే నడపనున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా, రియాద్ (RUH), దమ్మామ్ (DMM) నగరాలకు రాకపోకలు సాగించే విమాన సర్వీసులను అక్టోబర్ 24వరకు, ఆ రోజుతో సహా రద్దు చేసినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది.

విమాన షెడ్యూళ్లలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు తమ ప్రయాణ తేదీకి 48 గంటల ముందు ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని సూచించింది. టికెట్ బుకింగ్‌లు, విమాన సర్వీసులకు సంబంధించిన తాజా సమాచారం కోసం ఖతార్ ఎయిర్‌వేస్ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ను విజిట్ చేయాలని ప్రయాణికులకు సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com