సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!

- October 20, 2026 , by Maagulf
సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!

రియాద్: సౌదీ అరేబియాలో 2026 మూడో త్రైమాసికంలో రియల్ ఎస్టేట్ ధరలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 1.2 శాతం పెరిగాయి. నివాస, వ్యవసాయ ఆస్తుల ధరలు పెరగడం ఇందుకు ప్రధాన కారణమని జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) వెల్లడించింది. అయితే, అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే మొత్తం రియల్ ఎస్టేట్ ధరల సూచీ 1.2 శాతం తగ్గింది.

GASTAT విడుదల చేసిన రియల్ ఎస్టేట్ ప్రైస్ ఇండెక్స్ (REPI) నివేదిక ప్రకారం..  2025 మూడో త్రైమాసికంతో పోలిస్తే 2026 మూడో త్రైమాసికంలో నివాస ఆస్తుల ధరలు 2.3 శాతం పెరిగాయి. వ్యవసాయ ఆస్తుల ధరలు 3.9 శాతం పెరిగాయి. మరోవైపు, వాణిజ్య ఆస్తుల ధరలు వార్షిక ప్రాతిపదికన 2 శాతం తగ్గాయి. అదేవిధంగా నివాస స్థలాల ధరలు 4.9 శాతం, అపార్ట్‌మెంట్ల ధరలు 1.7 శాతం, నివాస ఫ్లోర్ యూనిట్ల ధరలు 0.8 శాతం పెరుగగా, విల్లాల ధరలు 7.7 శాతం తగ్గాయి.

వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంలోనూ ధరలు తగ్గాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే వాణిజ్య స్థలాల ధరలు 2.1 శాతం తగ్గగా, భవనాల ధరలు 1.4 శాతం పడిపోయాయి. షోరూమ్‌లు, రిటైల్ దుకాణాల ధరలు 0.9 శాతం తగ్గాయి. వ్యవసాయ ఆస్తుల ధరలు మాత్రం 3.9 శాతం పెరిగాయి. వ్యవసాయ భూముల ధరలు పెరగడం ఇందుకు కారణమని నివేదిక పేర్కొంది.

2026 రెండో త్రైమాసికంతో పోలిస్తే మూడో త్రైమాసికంలో సౌదీ అరేబియా మొత్తం రియల్ ఎస్టేట్ ధరల సూచీ 1.2 శాతం తగ్గింది.  వాణిజ్య ఆస్తుల ధరలు అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 0.3 శాతం తగ్గగా, వ్యవసాయ ఆస్తుల ధరలు 0.2 శాతం పెరిగాయి.

ప్రాంతాల వారీగా చూస్తే, వార్షిక ప్రాతిపదికన రియల్ ఎస్టేట్ ధరల్లో అత్యధికంగా నార్తర్న్ బోర్డర్స్ ప్రాంతంలో 12 శాతం పెరుగుదల నమోదైంది. రియాద్‌లో 4.6 శాతం, మదీనాలో 0.3 శాతం పెరుగుదల నమోదైంది. మరోవైపు, అసీర్ ప్రాంతంలో అత్యధికంగా 4.3 శాతం ధరలు తగ్గాయి. హాయిల్‌లో 3.8 శాతం, తూర్పు ప్రావిన్స్‌లో 3.7 శాతం, అల్-జౌఫ్‌లో 2.8 శాతం తగ్గుదల నమోదైంది.

సౌదీ అరేబియా వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ లావాదేవీల సమాచారాన్ని ఉపయోగించి ఆస్తుల ధరల్లో మార్పులను కొలవడానికి రియల్ ఎస్టేట్ ప్రైస్ ఇండెక్స్‌ను రూపొందిస్తున్నట్లు GASTAT తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com