దుబాయ్‌లో ఘనంగా స్పార్క్ మీడియా 5వ వార్షిక బతుకమ్మ సంబరాలు 2026
- October 21, 2026
దుబాయ్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళలను ప్రతిబింబిస్తూ దుబాయ్‌లో 5వ వార్షిక బతుకమ్మ సంబరాలు 2026 ఘనంగా నిర్వహించారు. స్పార్క్ మీడియా ఆధ్వర్యంలో, ది లెమన్ స్టూడియో సమర్పణలో అక్టోబర్ 17న జరిగిన ఈ వేడుకల్లో మహిళలు, కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సంప్రదాయాలు, జానపద సంగీతం, నృత్య ప్రదర్శనలతో కార్యక్రమం సందడిగా సాగింది.
దుబాయ్‌లోని ముహైస్నా 4లో ఉన్న అల్ దాన్ ప్రైవేట్ స్కూల్లోని వెస్ట్‌ఫోర్డ్ స్పోర్ట్స్ హాల్లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఈ వేడుకలు నిర్వహించారు. మహిళలు, కుటుంబాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఉచిత ప్రవేశం కల్పించారు.
ఈ వేడుకల్లో ప్రముఖ జానపద గాయనులు శ్రీనిధి, మమతా రమేష్, జానపద నృత్య కళాకారిణులు వైష్ణవి సోని, వర్షిణి తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. తేజస్వి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, వీడీజే మహేశ్ సంగీతాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి AES ఫౌండర్ అయేషా షేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సంప్రదాయ బతుకమ్మ ఆటలు, తెలంగాణ జానపద గీతాలు, నృత్య ప్రదర్శనలు, వివిధ విభాగాల్లో మహిళలకు అవార్డుల ప్రదానం, ప్రత్యేక ఫొటోగ్రఫీ బూత్, డీజే కార్యక్రమాలు వేడుకల్లో ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
రాయల్ ఐకాన్ ఈవెంట్స్ ఎల్ఎల్సీ ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను చేపట్టగా, సిగ్నేచర్ స్టూడియోస్ భాగస్వామ్యమైంది. ఎస్ఆర్ఆర్ బిల్డింగ్ మెటీరియల్ ట్రేడింగ్ ఎల్ఎల్సీ, వీఆర్ఎస్ టెక్నాలజీస్ ఎల్ఎల్సీ, క్యాటలిస్ట్ డైమండ్ స్పాన్సర్లుగా వ్యవహరించాయి. లీడర్స్ ఈవెంట్స్, గల్ఫ్ స్టార్ సంస్థలు సహకారం అందించాయి.
ఈ వేడుకలకు మా గల్ఫ్ న్యూస్, టీవీ5 న్యూస్ మీడియా భాగస్వాములుగా వ్యవహరించాయి.
విదేశీ గడ్డ పై తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను సజీవంగా ఉంచుతూ, ప్రవాస భారతీయ మహిళలు, కుటుంబ సభ్యుల మధ్య సాంస్కృతిక ఐక్యతను పెంపొందించడంలో ఈ బతుకమ్మ సంబరాలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అతిథులు, కళాకారులు, స్పాన్సర్లు, సహకార సంస్థలు, మహిళలు, కుటుంబ సభ్యులు, ఇతరులందరికీ స్పార్క్ మీడియా ఎండీ అరుణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.





తాజా వార్తలు
- మొబైల్ ఫోన్ గొడవ..ఇద్దరి హత్యకు దారి
- దుబాయ్‌లో ఘనంగా స్పార్క్ మీడియా 5వ వార్షిక బతుకమ్మ సంబరాలు 2026
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్‌లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం
- షార్జాలో ఇంధన వాసనపై ఆందోళన వద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది: అధికారులు
- మక్కాలో అనుచిత చర్యల వీడియోపై తప్పుడు ప్రచారం.. స్పష్టం చేసిన హోలీ మాస్క్స్
- బహ్రెయిన్ రాజు హమద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష







