యువత ఉపాధే లక్ష్యమన్న సీఎం రేవంత్
- October 21, 2026
తెలంగాణ: జడ్చర్లలో వైభవంగా విజయదశమి వేడుకలు.. కనువిందు చేసిన లేజర్ షో.. జడ్చర్ల పట్టణంలోని బి.ఆర్.ఆర్. డిగ్రీ కళాశాల మైదానంలో స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో విజయదశమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విజయదశమి పండుగ ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని యువతకు, నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆదర్శవంతమైన జిల్లాగా ఎదగాలని ఆకాంక్షించారు. జడ్చర్ల పట్టణం, నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ప్రగతిపథంలో ముందుకు సాగాలని పేర్కొన్నారు.
వేడుకల్లో మెరిసిన ప్రత్యేక డ్రోన్ షో
విజయదశమి పర్వదినం ప్రజల జీవితాల్లో సంతోషం, శ్రేయస్సు, అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం విజయదశమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన రావణ దహన కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక ఆకర్షణగా లేజర్ షో రావణ దహన కార్యక్రమానికి ముందు నిర్వహించిన డ్రోన్ షో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆకాశంలో రంగురంగుల కాంతులతో నిర్వహించిన ఈ ప్రదర్శన వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డ్రోన్ షోను తిలకిస్తూ ప్రజలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్, జిల్లా ఎస్పీ జానకి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ,, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, తహశీల్దార్ నర్సింగరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు, ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ ఎన్నారైల అభివృద్ధి, ఆర్థిక భరోసాకు APNRT కీలక ఆలోచనలు
- యూఏఈలో రేపు వర్షాలు కురిసే అవకాశం..
- యువత ఉపాధే లక్ష్యమన్న సీఎం రేవంత్
- నిర్లక్ష్యంగా డ్రైవింగ్.. డ్రైవర్‌కు జైలు, కారును ధ్వంసం చేసిన కువైట్ అధికారులు
- అబుదాబిలో షఖ్‌బౌట్ బిన్ సుల్తాన్ వీధిలో మూడు రోజుల పాటు పాక్షిక రహదారి మూసివేత
- అంతర్జాతీయ బాండ్ల జారీతో కువైట్‌కు 3.25 బిలియన్ డాలర్లు
- షార్జాలో పోగొట్టుకున్న, యజమానులు క్లెయిమ్ చేయని వస్తువుల నిర్వహణపై కొత్త చట్టం
- సౌదీ అరేబియాలో 5 డ్రోన్లను అడ్డుకున్న సంకీర్ణ దళాలు..
- ఏపీలో ఎన్నికల పై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- మొబైల్ ఫోన్ గొడవ..ఇద్దరి హత్యకు దారి







