దుబాయ్‌లో ఘనంగా AES అచీవర్స్ సమ్మిట్ & ఆనర్స్ 2026
- October 22, 2026
మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్‌లో వ్యాపారవేత్తలకు సత్కారం.. దివ్యాంగులు, క్యాన్సర్ విజేతల ప్రతిభకు ప్రోత్సాహం
దుబాయ్: వ్యాపారవేత్తలు, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విజేతలు, కమ్యూనిటీ సభ్యులను ఒకే వేదికపైకి తీసుకువస్తూ AES అచీవర్స్ సమ్మిట్ & ఆనర్స్ 2026 దుబాయ్‌లో ఘనంగా జరిగింది. అక్టోబర్ 10, 2026న దుబాయ్‌లోని మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమం నెట్‌వర్కింగ్, ప్రతిభకు గుర్తింపు, సాంస్కృతిక ప్రదర్శనలతో సందడిగా సాగింది.
ఈ కార్యక్రమానికి హర్ హైనెస్ షేఖా ఆయిషా హుమైద్ అల్ ముఅల్లా, హిస్ ఎక్సలెన్సీ అబ్దుల్లా అల్ మైనాహ్ ముఖ్య అతిథులుగా హాజరై వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
AES Edu Marketing Events Network FZE ఆధ్వర్యంలో, సంస్థ వ్యవస్థాపకురాలు ఆయేషా షేక్ నేతృత్వంలో ఈ సమ్మిట్‌ను నిర్వహించారు. వ్యాపార రంగంలో విశేష విజయాలు సాధించినవారిని గుర్తించడంతోపాటు, సమాజానికి సేవలందిస్తున్న వ్యక్తులను గౌరవించడం, సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.
వ్యాపారవేత్తలకు నెట్‌వర్కింగ్ వేదిక
కార్యక్రమంలో భాగంగా ఉదయం నిర్వహించిన AES బిజినెస్ నెట్‌వర్కింగ్ మీట్‌అప్‌లో పలువురు వ్యాపారవేత్తలు, వృత్తి నిపుణులు పాల్గొన్నారు. పరస్పర పరిచయాలు పెంపొందించుకోవడం, వ్యాపార ఆలోచనలను పంచుకోవడం, కొత్త భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడంపై చర్చించారు.
AES కమ్యూనిటీకి చెందిన విజన్ కలిగిన వ్యాపార నాయకులను వారి విజయాలు, సేవలకు గుర్తింపుగా సత్కరించారు. వ్యాపార అభివృద్ధి, బ్రాండ్ విజిబిలిటీ, విజయానికి అవసరమైన ఆలోచనా విధానంపై నిర్వహించిన ప్యానెల్ చర్చలు పలువురికి ఉపయోగకరంగా నిలిచాయి.
దివ్యాంగులు, క్యాన్సర్ విజేతల ప్రతిభకు వేదిక
సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దివ్యాంగులు (People of Determination), క్యాన్సర్‌ను ధైర్యంగా ఎదుర్కొన్న విజేతలు, AES కమ్యూనిటీ సభ్యులు వివిధ ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
వారి ప్రతిభ, ధైర్యం, పట్టుదలను చాటిచెప్పేలా కార్యక్రమాలను రూపొందించారు. తమ తమ రంగాల్లో విశేష విజయాలు సాధించిన అవార్డు గ్రహీతలను సత్కరించి, వారి కృషి సమాజానికి అందిస్తున్న స్ఫూర్తిని కొనియాడారు.
కార్యక్రమ విజయానికి సహకరించిన స్పాన్సర్లు, భాగస్వామ్య సంస్థలను కూడా నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన సంస్థల్లో MAA Gulf News కూడా ఉంది. అలాగే Wings of Angel, EDUSCAN Group, Khaleej Times, AG Events, Ferns N Petals, High Choice Advertising, The Lemon Studio by Ramesh, Spurbz, Mr. Kabir, Neharika Tours, Naqsh by Rabi, Adaakari Art Studio, Urwashi Abacus Academy, Funun Arts, BYTE Inclusive Affairs, Adbhut: Musicians of Hope, Suidhaaga Fashion Designing LLC, Scothies Candles, Pixanova, DS Info Tech, SKOOLSY తదితర సంస్థలకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన మద్దతుదారులు, కోర్ టీమ్ సభ్యులు, అంబాసిడర్లు, వాలంటీర్లు, కళాకారుల సేవలను కూడా అభినందించారు.
ఉదయం వ్యాపార చర్చలతో ప్రారంభమై, సాయంత్రం సాంస్కృతిక వేడుకలు, అవార్డుల ప్రదానంతో ముగిసిన ఈ సమ్మిట్ వ్యాపారం, ప్రతిభ, సామాజిక సేవలను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. సమాజంలోని విభిన్న వర్గాలకు అవకాశాలు కల్పిస్తూ, పరస్పర సహకారం మరియు సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించాలన్న AES సంస్థ లక్ష్యాన్ని ఈ కార్యక్రమ మరోసారి చాటిచెప్పింది.





తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా AES అచీవర్స్ సమ్మిట్ & ఆనర్స్ 2026
- సౌదీ అరేబియాను వెంటనే విడిచి వెళ్ళండి..అమెరికా ఆదేశం
- సౌదీలో మసాజ్ సెంటర్లో అనైతిక కార్యకలాపాలు.. ప్రవాసి అరెస్ట్..!!
- ఒమన్‌లో సైబర్ సెక్యూరిటీ రంగానికి ఊతం..
- ఖతార్‌లో సెప్టెంబర్‌లో రికార్డు స్థాయిలో లావాదేవీలు..!
- అంతర్జాతీయ మోసాలకు చెక్..✓
- కువైట్‌లో అక్రమ మద్యం తయారీ కేంద్రం గుట్టురట్టు..!
- బహ్రెయిన్‌లో వీధి కుక్కలు, పిల్లుల సమస్యకు పరిష్కారం..!
- ఏపీలో స్ధానిక ఎన్నికలను తాత్కాలికంగా నిలిపేసిన SEC
- మైసూరు దసరాలో వైభవంగా జంబూ సవారి..







