మార్చి 24న మస్కట్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన 2027..!!
- October 22, 2026
మస్కట్: మస్కట్ అంతర్జాతీయ బుక్ ఫెయిల్ (Muscat International Book Fair) 2027 మార్చి 24న ప్రారంభం కానుంది. ఈ 30వ ఎడిషన్‌కు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించేందుకు, సమాచార శాఖ మంత్రి మరియు కమిటీ చైర్మన్ డాక్టర్ అబ్దుల్లా బిన్ నాసర్ అల్-హర్రాసీ అధ్యక్షతన ప్రధాన కమిటీ ఒక సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ ఫెయిర్ 2027 మార్చి 24 నుండి ఏప్రిల్ 3 వరకు జరుగుతుందని తెలిపారు. రచయితలు, మేధావులు, పబ్లిషర్స్ మరియు సాంస్కృతిక రంగంపై ఆసక్తి ఉన్నవారిని ఒకచోట చేర్చే సాంస్కృతిక మరియు మేధోపరమైన వేదికగా, ఈ ప్రదర్శనలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రాథమిక ప్రణాళికలను చర్చించారు.
అలాగే, ఈ 30వ ఎడిషన్‌లో 'గెస్ట్ ఆఫ్ హానర్'గా పాల్గొంటున్న 'అల్-వుస్తా గవర్నరేట్' (Al-Wusta Governorate) భాగస్వామ్యం గురించి కమిటీ చర్చించింది. ఆ ప్రాంతానికి చెందిన చారిత్రక, సాంస్కృతిక మరియు ఆర్థిక అంశాలను, అలాగే దాని వారసత్వం, సహజ వనరులు మరియు పెట్టుబడి అవకాశాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలను రూపొందించడంపై దృష్టి సారించాలని నిర్ణయించారు.
ఒమన్ సుల్తానేట్‌లో అత్యంత ప్రముఖ సాంస్కృతిక కార్యక్రమాలలో ఒకటిగా మస్కట్ అంతర్జాతీయ బుక్ ఫెయిర్ స్థాయిని మరింత పెంపొందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో కంపెనీలకు షాక్.. 10వేల కంపెనీల ఫైళ్లు నిలిపివేత..!!
- సౌదీ అరేబియాలో భారీగా పెరిగిన నిర్మాణ వ్యయాలు..!!
- ఖతార్ లో అత్యవసర ప్రతిస్పందన బలోపేతం..!!
- మార్చి 24న మస్కట్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన 2027..!!
- వాహనం ఢీకొని 23 ఏళ్ల మోటార్‌సైకిలిస్ట్ మృతి..!!
- దుబాయ్‌లోని పామ్ జుమేరా వద్ద కొత్త 'వ్యూ' పాయింట్..!!
- దుబాయ్‌లో రెండు నెలల చిన్నారికి గుండె శస్త్రచికిత్స.. Dh146,515 వైద్య ఖర్చులు!
- సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయంలో విమాన సర్వీసులు పునఃప్రారంభం
- నాంపల్లి గ్రౌండ్స్‌లో అట్టహాసంగా ‘అలయ్ బలయ్’ వేడుకలు ప్రారంభం
- దుబాయ్‌లో ఘనంగా AES అచీవర్స్ సమ్మిట్ & ఆనర్స్ 2026







