‘జైలర్ 2’ మూవీ పై ప్రశంసలు కురిపించిన అల్లు అర్జున్
- October 23, 2026
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా సంచలన చిత్రం ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా విజయంపై టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు. రజనీకాంత్ స్టార్‌డమ్, స్టైల్, ఆరా ఈ సినిమాలో అద్భుతంగా పండాయని కొనియాడారు. ప్రేక్షకుల్లో ఆద్యంతం ఉత్కంఠను పెంచే పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా సినిమా ఆకట్టుకుందని పేర్కొంటూ చిత్రబృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ మేరకు అల్లు అర్జున్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా..
“రజనీ సార్ స్టార్‌డమ్, స్వాగ్, ఆరాకు ‘జైలర్ 2’ నిజమైన నిదర్శనం. సినిమా ఆద్యంతం ఉత్కంఠను కొనసాగించే కమర్షియల్ ఎంటర్‌టైనర్. అనిరుధ్ అదరగొట్టాడు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత ఈ సినిమా కోసం తమ హృదయాలను పెట్టి పనిచేశారు. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ అద్భుతమైన హిట్ అందించాడు. చొక్కా నలగకుండా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఒక్క రజనీగారికే సాధ్యం” అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.
రూ.500 కోట్ల క్లబ్‌లో ‘జైలర్ 2’.. సినీ ప్రముఖుల అభినందనలు
ప్రపంచవ్యాప్తంగా ‘జైలర్ 2’ సినిమా రూ.500 కోట్ల వసూళ్ల మార్కును విజయవంతంగా దాటడంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సినీ నటులు, దర్శకులు చిత్రయూనిట్‌కు అభినందనలు తెలుపుతున్నారు. బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్, కమల్ హాసన్, ధనుష్ వీరితో పాటు దర్శకులు లింగుస్వామి, వెంకట్ ప్రభు, కార్తీక్ సుబ్బరాజ్ తదితరులు కూడా రజనీకాంత్ నటనను, నెల్సన్ టేకింగ్‌ను, అనిరుధ్ సంగీతాన్ని కొనియాడుతూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజా వార్తలు
- ఏపీ సీఎస్ సాయిప్రసాద్ పదవీకాలం పొడిగింపు
- దుబాయ్‌లో ఆన్లైన్ పెట్టుబడుల మోసం.. 30 ఏళ్ల పొదుపు Dh400,000 పైగా స్వాహా!
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రీషెడ్యూల్..
- సౌదీ విమానాశ్రయం, చమురు క్షేత్రంపై హూతీ దాడులు..
- కర్ణాటకలో విషాదం: బురదలో దిగబడిన కారు.. ఊపిరాడక ముగ్గురు మృతి
- యాస్ ఐలాండ్‌లో మరోసారి IIFA సందడి.. 2027 జనవరి 22, 23 తేదీల్లో వేడుకలు!
- కువైట్‌లో కంపెనీలకు షాక్.. 10వేల కంపెనీల ఫైళ్లు నిలిపివేత..!!
- సౌదీ అరేబియాలో భారీగా పెరిగిన నిర్మాణ వ్యయాలు..!!
- ఖతార్ లో అత్యవసర ప్రతిస్పందన బలోపేతం..!!
- మార్చి 24న మస్కట్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన 2027..!!







