ఖతార్‌లోని సీలైన్, ఖోర్ అల్ అదీద్ బీచ్‌ వద్ద రాకపోకలపై నిషేధం..!!

- October 24, 2026 , by Maagulf
ఖతార్‌లోని సీలైన్, ఖోర్ అల్ అదీద్ బీచ్‌ వద్ద రాకపోకలపై నిషేధం..!!

దోహా: ఖతార్‌లోని సీలైన్ నుంచి ఖోర్ అల్ అదీద్ వరకు ఉన్న బీచ్‌లలో సముద్ర తీరానికి 30 మీటర్ల పరిధిలో వాహనాలు నడపడాన్ని అధికారులు నిషేధించారు. లెఖ్వియాకు చెందిన పర్యావరణ భద్రతా విభాగం, పర్యావరణం మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పరిధిలోని సహజ సంరక్షిత ప్రాంతాల విభాగంతో కలిసి ఈ నిర్ణయం తీసుకుంది.

సీలైన్, ఖోర్ అల్ అదీద్ బీచ్‌లు ప్రజలు విశ్రాంతి తీసుకోవడానికి, వినోద కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతాలని లెఖ్వియా పేర్కొంది. ఈ ప్రాంతాలను సురక్షితంగా ఉంచేందుకు సముద్ర తీరానికి 30 మీటర్ల పరిధిలో వాహనాలు నడపడం పూర్తిగా నిషేధించినట్లు సోషల్ మీడియా వేదికలపై విడుదల చేసిన వీడియోలో వెల్లడించింది.

నిబంధనలు ఉల్లంఘిస్తే QR100,000 వరకు జరిమానా

ఈ నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష లేదా QR100,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. లేదా ఈ రెండు శిక్షల్లో ఏదో ఒకటి విధించవచ్చు. వన్యప్రాణులు, వాటి సహజ ఆవాసాల పరిరక్షణకు సంబంధించిన చట్టం (నం. 19 ఆఫ్ 2004) ప్రకారం ఈ చర్యలు తీసుకుంటారు. బీచ్‌ల సహజ వాతావరణాన్ని, పర్యావరణాన్ని కాపాడటంతో పాటు సందర్శకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. సీలైన్, ఖోర్ అల్ అదీద్ ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com