రెండు బాలిస్టిక్ మిస్సైల్స్, రెండు డ్రోన్లు ధ్వంసం..!!

- October 24, 2026 , by Maagulf
రెండు బాలిస్టిక్ మిస్సైల్స్, రెండు డ్రోన్లు ధ్వంసం..!!

రియాద్‌: సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకుని యెమెన్‌లోని హౌతీ మిలీషియా ప్రయోగించిన రెండు బాలిస్టిక్ మిస్సైళ్లను, రెండు డ్రోన్లను సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకుని ధ్వంసం చేశాయి. రియాద్‌, ఖమీస్ ముషైత్ నగరాలతో పాటు దేశ దక్షిణ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు ప్రయత్నించినట్లు యెమెన్‌లో చట్టబద్ధ ప్రభుత్వానికి మద్దతుగా పనిచేస్తున్న సంకీర్ణ దళాలు వెల్లడించాయి. సంకీర్ణ దళాల అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మాలికి ఈ వివరాలను ప్రకటించారు.

ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ మిలీషియా ఖమీస్ ముషైత్ వైపు ప్రయోగించిన బాలిస్టిక్ మిస్సైల్ ను సౌదీ రక్షణ వ్యవస్థలు అడ్డుకుని ధ్వంసం చేసినట్లు తెలిపారు. మరో ప్రకటనలో రియాద్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించిన మరో బాలిస్టిక్ మిస్సైల్ ను కూడా అడ్డుకుని నాశనం చేసినట్లు వెల్లడించారు. అలాగే,  సౌదీ అరేబియా దక్షిణ ప్రాంతం వైపు ప్రయోగించిన రెండు డ్రోన్లను సైతం అడ్డుకున్నట్లు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com