బహ్రెయిన్‌లో క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఊరట..!!
- October 24, 2026
మనామా: బహ్రెయిన్‌లో క్రెడిట్ కార్డుల కనీస నెలవారీ చెల్లింపును ప్రస్తుత 5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించే ప్రతిపాదనపై మంగళవారం(అక్టోబర్ 27) ఎంపీలు చర్చించి ఓటింగ్ నిర్వహించనున్నారు. ఎంపీ మొహమ్మద్ అల్ మారాఫీ ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఈ మార్పు వల్ల నెలవారీ బిల్లులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు, తక్కువ ఆదాయం కలిగిన వారికి ఆర్థిక భారం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.
కాగా, ప్రస్తుతం పెన్షనర్లకు అందిస్తున్న చెల్లింపు వెసులుబాటును ఇతర క్రెడిట్ కార్డు వినియోగదారులకు కూడా వర్తింపజేయాలని ప్రతిపాదించారు. అలాగే, అన్ని బ్యాంకులు, లైసెన్స్ పొందిన కార్డు జారీ సంస్థలు ప్రతి నెల 20వ తేదీన స్టేట్‌మెంట్లు పంపించాలని సూచించారు.
అయితే, కనీస చెల్లింపును తగ్గించడం వల్ల దీర్ఘకాలంలో వినియోగదారులపై వడ్డీ భారం పెరిగే ప్రమాదం ఉందని బహ్రెయిన్ అసోసియేషన్ ఆఫ్ బ్యాంక్స్ (BAB) హెచ్చరించింది. ప్రతి నెల తక్కువ మొత్తం చెల్లిస్తే బకాయి వేగంగా తగ్గకపోవడంతో వడ్డీ పెరిగి, అప్పు తీర్చడానికి ఎక్కువ సమయం పట్టవచ్చని తెలిపింది. దీంతో వినియోగదారుల క్రెడిట్ పరిమితి తగ్గడంతో పాటు, బ్యాంకులకూ బకాయిల వసూళ్లలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
అన్ని బ్యాంకులకు ఒకే విధమైన 2.5 శాతం చెల్లింపు నిబంధనను తప్పనిసరి చేయకుండా, వినియోగదారుల తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బట్టి బ్యాంకులే నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించాలని సూచించింది. నెలవారీ చెల్లింపుల భారం తగ్గించడంతో పాటు, వినియోగదారులు దీర్ఘకాలిక అప్పుల్లో కూరుకుపోకుండా చూసేలా సమతుల్య విధానం అవసరమని BAB అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఊరట..!!
- ఒమన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ.. వ్యక్తి ఎయిర్‌లిఫ్ట్..!!
- కువైట్‌లో నవంబర్ 6న సైన్స్ ఫెయిర్..ఉచిత ప్రవేశం..!
- ఖతార్‌లో డిజిటల్ వ్యాపారులకు గుడ్ న్యూస్..!!
- గాల్లోనే రెండు విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి!
- యూఏఈలో ఉద్యోగ నియామకాల్లో మార్పులు..!!
- సౌదీ అరేబియాపై కొనసాగుతున్న హౌతీల దాడులు..!!
- డ్రెయిన్ క్లీనర్‌తో ఇద్దరికి తీవ్ర గాయాలు.. రెస్టారెంట్ యజమాని, ఇద్దరు ఉద్యోగులకు Dh50,000 జరిమానా
- యూరప్‌లో ఎండల బీభత్సం.. 50 వేల మంది మృతి!
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీకి అరుదైన గుర్తింపు







