‘రోమియో జూలియట్’ క్రేజీ ఫన్ ఎంటర్టైనర్
- October 24, 2026
హర్షిత్, విశాఖ ధిమాన్ జంటగా నటిస్తున్న ‘రోమియో జూలియట్’ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. భార్గవ్ మాచర్ల రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ సమర్పిస్తుండగా, నవరస ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుందీప్ ఎన్, వెంకటేశ్వరరావు చల్లగుళ్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ‘రోమియో జూలియట్’ నవంబర్ 13న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ సారీ బేబీ సాంగ్ లాంచ్ చేశారు.
సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో హర్షిత్ మాట్లాడుతూ.. “దివాన సినిమాకి అందరూ సపోర్ట్ చేశారు. ‘రోమియో జూలియట్’కు మీ సపోర్ట్ కావాలని కోరుతున్నాను. మా సినిమా గ్లింప్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా ప్రభాస్ గారికి ధన్యవాదాలు. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం మా అందరికీ ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. భార్గవ్ ఈ కథను చాలా ఎంటర్టైనింగ్గా ప్రజెంట్ చేశాడు. ఇలాంటి క్యారెక్టర్‌ను తెలుగు సినిమాలో చూసి ఉండరు. ఇలాంటి క్రేజీ సినిమా నాకు తీసుకొచ్చిన మా డైరెక్టర్‌కు థాంక్యూ. లవ్ అనేది చాలా పవర్ఫుల్. సైలెంట్‌గా ఉండే మనిషి కూడా వైలెంట్‌గా మారుతుంటాడు. ఇందులో ఎలాంటి టాపిక్స్ మాట్లాడినా సరే, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. నవంబర్ 13న థియేటర్లలో ఎంజాయ్ చేస్తారు. ‘శుభం’, ‘దివానా’ సినిమాలు థియేటర్లలో మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలు. అలాగే ఇప్పుడు వస్తున్న ‘రోమియో జూలియట్’ కూడా కచ్చితంగా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇందులో అన్ని క్యారెక్టర్లు క్రేజీగా ఉంటాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్యూ. ఈటీవీ విన్ ప్రజెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. వైవా హర్ష ప్రసాద్ గారితో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉంది. విశాఖ చాలా గట్స్ ఉన్న క్యారెక్టర్ చేసింది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
డైరెక్టర్ భార్గవ్ మాచర్ల మాట్లాడుతూ.. “ఇది అందరి బయోపిక్. మనందరి జీవితంలో ఎక్కడో ఒకచోట కనెక్ట్ అయ్యే ఎమోషన్‌ను తీసుకుని సినిమాగా చేయడం జరిగింది. ఇది హిలేరియస్ ఫన్ రైడ్‌లా ఉంటుంది. రిలేషన్‌షిప్స్‌పై సోషల్ సెటైర్‌తో పాటు మంచి డ్రామా కూడా ఉంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. నవంబర్ 13న అందరూ థియేటర్లలో ఎంజాయ్ చేస్తారు.”
ఈటీవీ విన్ వైస్ ప్రెసిడెంట్ సాయికృష్ణ మాట్లాడుతూ.. “ మేము నిర్మించని సినిమా కాకుండా బయట సినిమాని ఫస్ట్ టైం ప్రజెంట్ చేస్తున్నాం . ఇది మాకు చాలా స్పెషల్. అలాగే మయూరి మూవీస్ ద్వారా ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నాం. ఇది యూత్‌ఫుల్ మూవీ. చాలా రిలేటబుల్‌గా, ఫన్‌గా ఉంటుంది.”
ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ భరణ్ మాట్లాడుతూ.. “ఇది ప్రస్తుత జనరేషన్‌పై మంచి హిలేరియస్ సినిమా. ‘లవ్ టుడే’ లాంటి ఎంటర్టైనర్. నవంబర్ 13న తప్పకుండా మీరంతా ఎంజాయ్ చేస్తారు. ఇందులో ప్రతి రిలేషన్‌షిప్‌ను హిలేరియస్‌గా టచ్ చేశారు. సినిమా మంచి ఎంటర్టైనర్గా ఉంటుంది.
హీరోయిన్ విశాఖ ధిమాన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతలకు థాంక్యూ. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. నవంబర్ 13న రిలీజ్ అవుతుంది. అదే రోజు నా బర్త్‌డే కూడా. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ప్రస్తుత జనరేషన్లోని రిలేషన్‌షిప్స్‌పై రూపొందిన సినిమా ఇది. కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది.”
వైవా హర్ష మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఇది అన్ని ఏజ్ గ్రూప్స్ కి కనెక్ట్ అయ్యే సినిమా. మంచి కామెడీ కూడా ఉంటుంది. డైరెక్టర్ భార్గవ్ రిలేషన్షిప్స్ గురించి చాలా స్టడీ చేసి ఈ సినిమా చేశారు. తప్పకుండా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.
నటీనటులు: హర్షిత్, విశాఖ ధిమాన్, వైవా హర్ష, సిరి హనుమంత్, ప్రసాద్ బెహరా, ప్రభాస్ శ్రీను, అజయ్ ఘోష్, అజయ్
సాంకేతిక బృందం
దర్శకత్వం: భార్గవ్ మాచర్ల
రచన: భార్గవ్ మాచర్ల, ప్రశాంత్ రాగతి
సంగీతం: గోపీసుందర్
సినిమాటోగ్రఫీ: అభిరాజ్ నాయర్
ఎడిటర్: యువ కిరణ్
ప్రొడక్షన్ డిజైన్: కార్తా ప్రొడక్షన్స్
ప్రొడక్షన్ డిజైన్ పర్యవేక్షణ: ధీరజ్ పొనుగోటి, ప్రకీర్తి ఉప్పలపాటి
నిర్మాతలు: సుందీప్ ఎన్, వెంకటేశ్వరరావు చల్లగుళ్ల
సహ నిర్మాతలు: గడ్డం రాకేశ్ రెడ్డి, రుద్రదేవ్ మదిరెడ్డి
బ్యానర్: నవరస ఎంటర్టైన్మెంట్స్
మార్కెటింగ్ స్ట్రాటజీ: తమడా మీడియా
డిజిటల్ మార్కెటింగ్: Warey Media
పీఆర్వో: వంశీ–శేఖర్
తాజా వార్తలు
- అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
- రస్ అల్ ఖైమాలో అన్ని బీచ్‌లు మూసివేత.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆంక్షలు
- ఏపీకి వాయుగుండం ముప్పు.. IMD హెచ్చరిక
- ఫ్రెంచ్ ఓపెన్ ఫైనలు పీవీ సింధు
- యూఏఈలో పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో మోసాలు..
- బహ్రెయిన్‌లో క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఊరట..!!
- ఒమన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ.. వ్యక్తి ఎయిర్‌లిఫ్ట్..!!
- కువైట్‌లో నవంబర్ 6న సైన్స్ ఫెయిర్..ఉచిత ప్రవేశం..!
- ఖతార్‌లో డిజిటల్ వ్యాపారులకు గుడ్ న్యూస్..!!
- గాల్లోనే రెండు విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి!







